కాకినాడ జిల్లా గోకవరం ఎల్లమ్మ చెరువు పుంత రోడ్డు అభివృద్ధికి నిధులు మంజూరు చేసి, యుద్ధప్రాతిపదికన పనులు వేగవంతం చేసిన జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూను రైతులు ఘనంగా సత్కరించారు.స్థానిక రావులమ్మనగర్లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో, గోకవరం తెలుగు రైతు సంఘ అధ్యక్షుడు చింతల రామకృష్ణ ఆధ్వర్యంలో ఎల్లమ్మ చెరువు చైర్మన్ చింతల సత్యనారాయణ, వైస్ చైర్మన్ మై పాల భగవాన్ రైతులతో కలిసి ఎమ్మెల్యే నెహ్రూను పూల మాలలు వేసి సత్కరించారు.ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ, ఎల్లమ్మ చెరువు చేరుకునే పుంత రోడ్డు గతంలో అధ్వానంగా ఉండగా, స్థానికుల విజ్ఞప్తి మేరకు నిధులు కేటాయించి రోడ్డు అభివృద్ధికి ముందుకొచ్చిన ఎమ్మెల్యే నెహ్రూ నిజమైన రైతు బాంధవుడు, మెట్ట ప్రాంత భగీరధుడని ప్రశంసించారు.
అదే సమయంలో, రహదారి పొడవును మరో 500 మీటర్లు పెంచాలని, సచివాలయం-2 సమీపంలోని ఖాళీ స్థలంలో రైతుల కోసం కమ్యూనిటీ హాల్ నిర్మించాలని వినతిపత్రం అందజేశామని, ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఇనకోటి నాగేశ్వరరావు, ఇనకోటి సత్యనారాయణ, ఎనకోటి దివాణం, రెడ్డి వీర్రాజు తదితరు