ముఖ్య అతిథిగా తుమ్మలపల్లి రమేష్
జగ్గంపేటలోని సాయి బాలాజీ ఫంక్షన్ హాలులో వందన యూత్ వాలంటరీ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో “ఎస్పీ బాలసుబ్రమణ్యం జాతీయ అవార్డు” ప్రధానోత్సవం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ఆర్గనైజేషన్ అధ్యక్షులు పులి ప్రసాద్ అధ్యక్షత వహించగా, ముఖ్య అతిథిగా భూపతి చారిటబుల్ ట్రస్ట్ ఛైర్మన్, జనసేన పార్టీ జగ్గంపేట ఇంచార్జ్ తుమ్మలపల్లి రమేష్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా జగ్గంపేట జనసేన ఇంచార్జ్ తుమ్మలపల్లి రమేష్ మాట్లాడుతూ రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన కళాకారులకు, గాయకులకు ఎస్పీ బాలసుబ్రమణ్యం గజాతీయ అవార్డు అందజేయడం గర్వకారణం. ఇలాంటి కార్యక్రమాల ద్వారా కళలను ప్రోత్సహించాలి. అవి అంతరించిపోకుండా రక్షించాల్సిన బాధ్యత మనందరిది,” అన్నారు.ఈ కార్యక్రమంలో మొత్తం 100 మంది కళాకారులకు అవార్డులు తుమ్మలపల్లి రమేష్ చేతుల మీదుగా ప్రదానం చేయబడాయి. కార్యక్రమంలో సీనియర్ ఎన్‌జీవో బోడపాటి కాంతం మాట్లాడుతూ ఎస్పీ బాలసుబ్రమణ్యం అవార్డు పొందడం ప్రతి కళాకారునికీ గౌరవకార్యం” అని అన్నారు.ఈ అవార్డు మహోత్సవంలో కూటమి నాయకురాలు చల్లా రాజ్యలక్ష్మి, క్యాండిల్ యూత్ వాలంటరీ ఆర్గనైజేషన్ అధ్యక్షుడు జుత్తుక నాగేశ్వరరావు, మాదారపు వీరబాబు, కురుమల్ల నాగేశ్వరరావు, కాయల మణికంఠ, మ్యూజిక్ మాస్టర్ ముసలి విజయభాస్కర్, ప్రముఖ గాయనులు సుజాత, రత్న, సరిపల్లి రమణ, పద్మావతి తదితరులు పాల్గొన్నారు.