ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఏపియుడబ్ల్యూజె) రాష్ట్ర సంఘం పిలుపు మేరకు మంగళవారం కాకినాడ జిల్లా జగ్గంపేటలో జర్నలిస్టులు భారీగా నిరసన తెలిపారు. జర్నలిస్టుల డిమాండ్స్ డే గా ఆగస్టు 5న పాటించాలని యూనియన్ కోరిన నేపథ్యంలో, జగ్గంపేట మరియు గండేపల్లి నియోజకవర్గాలకు చెందిన ఏపియుడబ్ల్యూజె సభ్యులు తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసనకు దిగారు.ఈ సందర్భంగా వారు ప్రభుత్వానికి తమ డిమాండ్లపై వినతిపత్రం సమర్పించగా, డిప్యూటీ తహసీల్దార్ నాగేశ్వరరావు స్వీకరించారు.పత్రికా స్వేచ్ఛకు పరిరక్షణ కల్పించాలి, జర్నలిస్టులకు రక్షణ చట్టం అమలు చేయాలి, పత్రికా ఉద్యోగులకు గుర్తింపు కార్డులు, ఆరోగ్య బీమా, గృహ నివాసాలు, పెన్షన్ వంటివి కల్పించాలని వారు డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా కార్యదర్శి చిక్కాల మణికంఠ, పూర్వపు జిల్లా ట్రెజరర్ బాబులు, జిల్లా నాయకులు సుంకర శ్రీనివాస్, రాయుడు సూర్యప్రకాశరావు, నియోజకవర్గ నాయకులు కాపవరపు భాస్కరరావు, గండేపల్లి కార్యదర్శి నేదూరి శ్రీధర్, జగ్గంపేట మండల సభ్యులు వి.ఎస్.ఎన్. మూర్తి, వెంపాటి రామారావు, రిషిరామ్, మధు తదితరులు పాల్గొన్నారు.