కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం కాట్రావులపల్లి గ్రామంలోని పీహెచ్సీ లో డాక్టర్ పోస్ట్లు ఖాళీగా ఉండటంతో గ్రామంలోని ప్రజలు వైద్యం కొరకు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని గ్రామ టిడిపి అధ్యక్షులు ముసిరెడ్డి నాగేశ్వరరావు కాకినాడలోని జిల్లా వైద్యాధికారి డాక్టర్ జె. నరసింహ నాయక్ ను కలిసి వినతిపత్రం అందజేశారు. మా కాట్రావులపల్లి గ్రామానికి తక్షణం వైద్య అధికారులను నియమించి పీహెచ్సీలో ఖాళీగా ఉన్న డాక్టర్ పోస్టులు భర్తీ చేయాలని డిఎంహెచ్వోను కోరినట్లు ముసిరెడ్డి నాగేశ్వరరావు తెలియశాజేశారు.తక్షణం స్పందించిన జిల్లా వైద్యాధికారి నరసింహ నాయక్ కాట్రావులపల్లి ఆసుపత్రికి ఒక లేడీ మెడికల్ ఆఫీసర్,ఒక జంట్ మెడికల్ ఆఫీసర్ ను నియమించాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేసినట్లు తెలియజేశారు..తక్షణం స్పందించి కాట్రావులపల్లి గ్రామానికి వైద్య అధికారులను నియమించేందుకు చర్యలు చేపట్టినందుకు డీఎం హెచ్ వో ముసిరెడ్డి నాగేశ్వరరావు కృతజ్ఞతలు తెలిపారు…