కొత్తపల్లి గ్రామానికి చెందిన 19 ఏళ్ల దిండి గణేష్‌కు రెండు కిడ్నీలు పని చేయకపోవడంతో చికిత్సకు అవసరమైన మందులు కొనుగోలు చేయలేని స్థితిలో ఉన్నాడు. ఈ నేపథ్యంలో తంటికొండకు చెందిన సీనియర్ జనసేన నాయకుడు కలిగిన నాగబాబు గారు చల్లా రాజ్యలక్ష్మి ద్వారా రూ.5,000 ఆర్థిక సహాయం అందించారు. ఈ డబ్బును కూటమి నాయకులు గణేష్ తల్లిదండ్రులకు చేతుల మీదుగా అందజేశారు.Oఈ సందర్భంగా చల్లా రాజ్యలక్ష్మి మాట్లాడుతూ, గణేష్‌కు ఆదరణగా ప్రతి ఒక్కరూ సహాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు దిండి వెంకటేశ్వరరావు, దిండి సూరిబాబు, తెంటీ అప్పారావు, ఆనంద్ తదితర కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.