Monday, August 4, 2025
Monday, August 4, 2025

కూటమి ప్రభుత్వ ఏడాది సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటా ప్రచారానికి అవగాహన సదస్సు

Share
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి

జగ్గంపేట

జగ్గంపేట :విశ్వం వాయిస్ న్యూస్

కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో సాధించిన విజయాలను, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు అవగాహనం కల్పించే ఉద్దేశంతో తొలి అడుగు ఇంటింటా ప్రచార కార్యక్రమం ప్రారంభించబోతోంది. ఈ మేరకు జగ్గంపేటలోని గోకవరం రోడ్డులోని సాయి బాలాజీ ఫంక్షన్ హాలులో అవగాహన సదస్సు జరిగింది.ఈ సమావేశానికి జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ ముఖ్య అతిథిగా హాజరై కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులు బూత్ ఇన్చార్జిలు గ్రామ పార్టీ అధ్యక్షులు సర్పంచులు ఎంపీటీసీలు అలాగే నియోజకవర్గ పరిశీలకులు శీలం వెంకటేశ్వరరావు గత ఎన్నికల అబ్జర్వర్లు గొర్ల సునీత తంగేళ్ల హరి కిషోర్ (బాబు) ముఖ్యంగా పాల్గొన్నారు.జులై 2వ తేదీ నుండి 30వ తేదీ వరకు నెలరోజులపాటు నిర్వహించబోయే ఈ ఇంటింటా ప్రచారంలో కూటమి ప్రభుత్వం ఏడాదిలో అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రతి కుటుంబానికి వివరించాలి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వం చేసిన సేవలు, భవిష్యత్తులో చేయబోయే పథకాలు సవివరంగా తెలియజేయాలి. ప్రజల సమస్యలు తెలుసుకుని వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళే బాధ్యత మనపై ఉంది అని తెలిపారు.ప్రధానంగా, ఎన్టీఆర్ భరోసా పింఛన్ మొత్తాన్ని రూ.4000కు పెంచడం, అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ, గృహిణులకు ఉచిత మూడు సిలిండర్ల పథకం, తల్లులకు తల్లికి వందనం ద్వారా ప్రతి బిడ్డకు రూ.13,000 మంజూరు, మత్స్యకార భరోసా, ఆగస్టు 15వ తేదీ నుండి మహిళలకు ఉచిత బస్సు పథకం, జులై నెలలో కేంద్ర ప్రభుత్వ సహాయంతో కలిపి అన్నదాత సుఖీభవ సూపర్ సిక్స్ పథకాలు వంటి ముఖ్య అంశాలను ఇంటింటా వెళ్లి వివరించాలని నెహ్రూ సూచించారు.ప్రచారం సమయంలో కూటమి ప్రభుత్వం ఇవ్వబోయే కరపత్రం పాటు, నియోజకవర్గ స్థాయిలో ప్రత్యేకంగా తయారు చేసిన కరపత్రాలను కూడా పంపిణీ చేయాలని సూచనలిచ్చారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు ప్రభుత్వ సేవలపై పూర్తి అవగాహన కల్పించడమే కాక, వారి అభిప్రాయాలను సేకరించేందుకు కూడా అవకాశం కల్పించబడుతుంది.ప్రజల మద్దతు దిశగా నెలరోజులపాటు పటిష్టంగా సాగబోయే ఈ ఇంటింటా ప్రచారం, ప్రభుత్వ విశిష్ట సంకల్పాలను గ్రామగ్రామాన చాటి చెప్పడానికి ప్రధాన వేదికగా నిలవనుందని ఆయన తెలియజేశారు. ఈ సదస్సులో ఎస్వీఎస్ అప్పలరాజు, కొత్త కొండబాబు, అడపా భరత్ బాబు, పుష్కర ప్రాజెక్ట్ చైర్మన్ అడబాల భాస్కర్ రావు, మారిశెట్టి భద్రం, పోతుల మోహనరావు, చదరం చంటిబాబు, మంగరౌతు రామకృష్ణతో పాటు పెద్ద సంఖ్యలో క్లస్టర్ ఇంచార్జులు, బూత్ ఇంచార్జులు, యూనిట్ ఇంచార్జులు, గ్రామ కమిటీ అధ్యక్షులు, సర్పంచులు, ఎంపీటీసీలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

 

 

 

 

 

తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

రచయిత నుండి మరిన్ని

సంబంధిత వార్తలు

For Ads
ఆంధ్రప్రదేశ్
అంబేద్కర్ కోనసీమ
సాధారణ వార్తలు
కాకినాడ
రాజకీయాలు
క్రైమ్ వాయిస్
విద్య వాయిస్
కిసాన్ వాయిస్
హెల్త్ వాయిస్
అలూరి సీతారామరాజు
ఆధ్యాత్మికం
సక్సెస్ వాయిస్
సినీ వాయిస్
తూర్పు గోదావరి
టెక్నాలజీ
కృష్ణా
తెలంగాణ
క్రీడా వాయిస్
వనిత వాయిస్
బిజినెస్ వాయిస్
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo