Saturday, August 2, 2025
🔔 9
Latest Notifications
Saturday, August 2, 2025
🔔 9
Latest Notifications

రంపచోడవరం కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేసి కారం తమ్మన్నదొర పేరు పెట్టాలి.

Share
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి

1840లో కారం తమ్మన్నదొర నాయకత్వం లోని బృందం 12 మంది బ్రిటిషు పోలీసులను హతమార్చి..ఈ ఘటన తరువాత 8సంవత్సరాల పాటు తమ్మన్నదొర గెరిల్లా పోరాటం కొనసాగించారని ఈ తరవాత తమ్మన్న అదృశ్యమయ్యారు.

విశ్వం వాయిస్ న్యూస్, రాజమహేంద్రవరం

రంపచోడవరం కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేసి తొలి మన్యం వీరుడు, స్వాతంత్య్ర సమరయోధుడు కారం తమ్మన్నదొర పేరు పెట్టాలని ఆదివాసీ మహాసభ ప్రెసిడెంట్ మిడియం వెంకటస్వామి, కుంజం వెంకటరమణమ్మ, న్యాయ సలహాదారు అయినాపురపు సూర్యనారాయణ డిమాండ్ చేసారు.కారం తమ్మన్నదొర, కారుకొండ సుబ్బారెడ్డిల అనుచరుల వివరాలను ప్రభుత్వం వెంటనే సేకరించి ప్రచురించాలని, వారి కుటుంబాలకు తగిన గుర్తింపు ఇవ్వాలని వారు కోరారు. స్థానిక ప్రెస్ క్లబ్ లో టి.సాయిపుష్ఠ, ముచ్చిక భాస్కర్ కృష్ణంరాజు, దొర, సోమాల దుర్గాప్రసాద్, సోడే పుష్ప, జక్కల పాండవులు, పూనెం విష్ణు, ముచ్చిక రంజిత్ కుమార్, గడుతూరి చిన్నారావు, అరగంటి వీరభద్రారెడ్డి, రెచ్చెల అబ్బాయి రెడ్డి, మామిడి చిన్నారెడ్డి, కారం తమన్న దొర బందపల్లి, కుటుంబ సభ్యులు, కారం జగదాంబ,కారం శ్రీరాము, కారం బాపిరాజు, కారం సుజాత, కారం శ్రీనివాస్ దొర తదితరులతో కల్సి శుక్రవారం ఉదయం విలేకరుల సమావేశం ఏర్పాటుచేసారు. ఆదివాసీ స్వాతంత్ర్య సమర యోధుల వివరాలు సేకరించాలని ప్రచురించిన కరపత్రాలను భారత న్యాయవాదుల సంఘం జాతీయ నాయకులు ముప్పాళ్ల సుబ్బారావు ఆవిష్కరించారు.ఐనాపురపు సూర్యనారాయణ మాట్లాడుతూ భారతదేశంలో 1857 సిఫాయిల తిరుగుబాటుకు ముందే బ్రిటిషువారిపై ఆంధ్రా ప్రాంతంలోని రంపచోడవరం కేంద్రంగా రంప తిరుగు బాటు 1839 నుండి 1848 వరకు జరిగిందని దీనికి రంపచోడవరం మండలంలోని బందపల్లికి చెందిన కోయ ముఠాదారు కారం తమ్మన్నదొర నాయకత్వం వహించారుని చెప్పారు. మరో ఐదుగురు ముఠాదారుల మద్దతుతో తమ్మన్నదొర 30మందితో కూడిన బలీయమైన సాయిధ బృందాన్ని ఏర్పాటుచేసి బ్రిటిషువారిపై జరిగిన అనేక దాడులకు నాయకత్వం వహించారని తెలిపారు.1840లో కారం తమ్మన్నదొర నాయకత్వం లోని బృందం 12 మంది బ్రిటిషు పోలీసులను హతమార్చి, 20మందిని తీవ్రంగా గాయపరచిందని,ఈ ఘటన తరువాత 8సంవత్సరాల పాటు తమ్మన్నదొర గెరిల్లా పోరాటం కొనసాగించారని ఈ తరవాత తమ్మన్న అదృశ్యమయ్యారని ఆయన చెప్పారు.25 జూలై 1880లో కారం తమ్మన్నదొరను బ్రిటిషు వారితో జరిగిన ఒక పోరాటంలో చనిపోయారని తెలిపారు. అయితే 1839 నుండి 1848 వరకు బ్రిటిషు వారిపై తిరుగుబాటు చేసిన తొలితరం తమ్మన్న దొరనే బ్రిటిషువారు 1880లో చంపి వేశారని ప్రజలంతా నమ్ముతున్నారు.దీంతో వీరిద్దరు ఒక్కరు కాదని తెలియజేయటం కోసం 1880లో మరణించిన తమ్మన్న దొర తలను నరికి కార్టాలిక్ ఆయిల్లో వుంచి రాజమండ్రి తీసుకువచ్చి ప్రదర్శించారని, అయినప్పటికీ ప్రజలు ఇద్దరూ ఒక్కరేనని విశ్వసించారని ఆయన వివరించారు.

తమ్మన్నదొర ఆంగ్లేయులతో యుద్ధం చేసేనాటికి మహాత్మా గాంధీ,జవహర్లాల్ నెహ్రూ,సర్దార్ వల్లభాయి పటేల్ వంటి వాళ్ళు అసలు పుట్టినే లేదని, అలాగే రంప తిరుగుబాటుదారు ఎవరంటే అల్లూరి సీతారామరాజు అని చెబుతారని అయితే వాస్తవానికి 1840లో బ్రిటిషు వారితో రంపలో యుద్ధం చేసిన తొలి రంప తిరుగుబాబు వీరుడు కారం తమ్మన్నదొర అని ఆయన చెప్పారు. అదేవిధంగా పోలవరం ప్రాంతంలో కారుకొండ సుబ్బారెడ్డి ఆంగ్లేయులపై తిరుగుబాటు చేయడంతో ఈయనతో పాటు 10 మంది అనుచరులను 1958 అక్టోబర్ 7న ఉరితీశారని, అదేవిధంగా 35 మంది అనుచరులకు జీవిత ఖైదీ విధించి గుంటూరు సెంట్రల్ జైలుకు తరలించడమే కాకుండా, మరో 8 మంది అనుచరులను అండమాన్ జైలుకు పంపారని సూర్యనారాయణ తెలిపారు. ఇంతటి చరిత్రగల తొలి గిరిజన వీరుని స్మరించుకోవడంలో ప్రభుత్వాలు ఉదాసీనంగా వ్యవహరించాయన్నారు. అతని కుటుంబ సభ్యులకు న్యాయం చేయడంలోను, ఆ పోరాట యోధులకు తగిన గౌరవాన్ని ఇవ్వడంలోను ప్రభుత్వాలు నిర్లక్ష్యంగానే వ్యవహరించా యన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల ముందు జగ్గంపేట సభలో ఇచ్చిన హామీ మేరకు రంపచోడవరం కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేసి,కారం తమ్మనదొర పేరు పెట్టాలని, అలాగే కె.ఆర్.పురం ఐటిడిఎకు కారుకొండ సుబ్బారెడ్డి పేరును పెట్టాలని ఆదివాసీ మహాసభ కోరుతోందని ఆయన అన్నారు. ఆగష్టు 15వ తేదీ లోగా ఈ వీరుల వివరాలు ప్రభుత్వం సేకరించాలని కోరారు.

తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

రచయిత నుండి మరిన్ని

సంబంధిత వార్తలు

For Ads
ఆంధ్రప్రదేశ్
అంబేద్కర్ కోనసీమ
సాధారణ వార్తలు
కాకినాడ
రాజకీయాలు
క్రైమ్ వాయిస్
విద్య వాయిస్
కిసాన్ వాయిస్
హెల్త్ వాయిస్
అలూరి సీతారామరాజు
ఆధ్యాత్మికం
సక్సెస్ వాయిస్
సినీ వాయిస్
తూర్పు గోదావరి
టెక్నాలజీ
కృష్ణా
తెలంగాణ
వనిత వాయిస్
బిజినెస్ వాయిస్
తీర్పు వాయిస్
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo