కే గోపాలపురంలో లబ్ధిదారులను ఎంపిక చేసిన అభివృద్ధి కమిటీ చైర్మన్ జ్యోతుల నవీన్
కాకినాడ జిల్లా గండేపల్లి మండలం కే గోపాలపురంలో గత 40 సంవత్సరాల క్రితం అప్పటి టిడిపి ప్రభుత్వం నిర్మించిన ఇల్లు శిధిలావస్థకు అవస్థకు చేరుకుని కూలిపోయే పరిస్థితిలో ఉండడంతో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఆ ఇళ్లను పరిశీలించి పి ఫోర్ విధానంలో నిర్మించేందుకు హామీ ఇవ్వడం అందులో భాగంగా ఆదివారం జగ్గంపేట నియోజకవర్గం అభివృద్ధి కమిటీ చైర్మన్, జిల్లా టిడిపి అధ్యక్షులు జ్యోతుల నవీన్ స్వయంగా వెళ్లి లబ్ధిదారులను ఎంపిక చేశారు. ఎస్టీలు 7, ఎస్సీలు 10, బీసీలు 12 మొత్తం 29 మందికి ఇల్లు నిర్మించేందుకు ఏర్పాట్లు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలియజేశారు. నవీన్ మాట్లాడుతూ ప్రభుత్వం సూపర్ 6 హామీల్లో భాగంగా పి ఫోర్ పథకంలో వీరికి ఇల్లు నిర్మించేందుకు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ సహకారంతో ఏర్పాటు చేస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గండేపల్లి జడ్పిటిసి పరిమి మంగతాయారు బాబు, జగ్గంపేట మండల టిడిపి అధ్యక్షులు జీను మణి బాబు, కే గోపాలపురం మాజీ సర్పంచ్ అవసరాల బాలసుబ్రమణ్యం, పీల మహేష్ తదితరులు పాల్గొన్నారు.

