14 October 2025
Tuesday, October 14, 2025

గెద్దనాపల్లిలో ఈగల్ క్లబ్ అవగాహన

Share
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి

జగ్గంపేట సి ఐ వై ఆర్ కె శ్రీనివాస్

కిర్లంపూడి ఎస్సై జి.సతీష్

విశ్వం వాయిస్ న్యూస్, జగ్గంపేట

కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలంలోని గెద్దనాపల్లి గ్రామ ప్రభుత్వ హైస్కూల్‌లో గురువారం ఈవ్‌టీజింగ్, ర్యాగింగ్ నిర్మూలన మత్తు పదార్థాల నిర్మూలన పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా జగ్గంపేట సీఐ వై ఆర్ కె శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రమశిక్షణ, మంచి ప్రవర్తన అలవాటు చేసుకోవాలి. ర్యాగింగ్, ఈవ్‌టీజింగ్ వంటి అనుచిత చర్యలు ఎప్పటికీ సహించబడవు. అలాంటి వాటికి పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవు. మత్తు పదార్థాలు, మద్యం వంటి అలవాట్లకు దూరంగా ఉండాలి. ఒకసారి అలాంటి వాటికి అలవాటు అయితే అది జీవితాన్నే నాశనం చేస్తుంది. విద్యార్థుల భవిష్యత్తు బంగారంలా వెలిగేలా చదువుపై దృష్టి పెట్టాలి. తల్లిదండ్రులు కూడా పిల్లలపై శ్రద్ధ చూపాలి. పాఠశాల చుట్టుపక్కల ఎవరైనా అనుమానాస్పదంగా తిరిగినా లేదా ఏదైనా సమస్య తలెత్తినా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి. పోలీసులు ఎప్పుడూ ప్రజల రక్షణలో ఉన్నారు. మీరు నిస్సంకోచంగా మాకు తెలియజేయండి అని విద్యార్థులకు సూచించారుఅలాగే కిర్లంపూడి ఎస్సై జి. సతీష్ మాట్లాడుతూ సమాజంలో యువత భవిష్యత్తు సురక్షితంగా ఉండేందుకు పోలీసులు కృషి చేస్తున్నారు. మీరు చదువుపై దృష్టి పెట్టి, మంచి పౌరులుగా ఎదగాలి. రోడ్డు రవాణా నియమాలు పాటించాలి. మోటార్‌సైకిల్‌ నడుపుతున్నప్పుడు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలి. మత్తు పదార్థాలు, గుట్కా, సిగరెట్ వంటి దుష్ప్రవర్తనలకు దూరంగా ఉండాలి. తల్లిదండ్రులు కూడా పిల్లలపై శ్రద్ధ వహిస్తే, సమాజం సురక్షితంగా ఉంటుంది. పాఠశాల పరిసరాల్లో ఏవైనా సమస్యలు గమనించినా వెంటనే పోలీసులకు తెలియజేయండి. మేము ఎల్లప్పుడూ మీకు అండగా ఉంటాము” అని విద్యార్థులకు హితవు పలికారు.ఈ సందర్భంగా ఈగల్ క్లబ్ సభ్యులు విద్యార్థులకు పాఠశాల పరిసరాల్లో ఎటువంటి ర్యాగింగ్ ఈవ్‌టీజింగ్, మత్తు పదార్థాల వినియోగం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అలాగే ఎటువంటి సమస్యలు తలెత్తినా వెంటనే 9440796529, పోలీస్ వాట్సాప్ నంబర్ 9494933233, అలాగే 100/112 నంబర్లకు సమాచారం ఇవ్వాలని తెలిపారు .ఈ కార్యక్రమంలో హెడ్‌మాస్టర్ డి.వి.రాజు, మురళీ శ్రీనివాస్, పి.డి. దేవి, బోధనా సిబ్బంది తో పాటు పిఎస్‌ఐ రాజు కూడా హాజరయ్యారు.

తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

రచయిత నుండి మరిన్ని

సంబంధిత వార్తలు

For Ads
ఆంధ్రప్రదేశ్
సాధారణ వార్తలు
అంబేద్కర్ కోనసీమ
కాకినాడ
రాజకీయాలు
క్రైమ్ వాయిస్
తూర్పు గోదావరి
విద్య వాయిస్
ఆధ్యాత్మికం
కిసాన్ వాయిస్
హెల్త్ వాయిస్
సక్సెస్ వాయిస్
పండుగలు
అలూరి సీతారామరాజు
తెలంగాణ
ఎడిటర్ వాయిస్
సినీ వాయిస్
టెక్నాలజీ
క్రీడా వాయిస్
తీర్పు వాయిస్
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo