Saturday, August 2, 2025
Saturday, August 2, 2025

గోకవరంలో ఆయిల్ ఫామ్ తోటల విస్తరణ మహోత్సవం

Share
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి

ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ

విశ్వం వాయిస్ న్యూస్, జగ్గంపేట

ఆయిల్ పామ్ తోటల విస్తరణ మహోత్సవం కార్యక్రమంలో భాగంగా గోకవరం గ్రామంలో శుక్రవారం ఉద్యాన శాఖ, పతంజలి ఫుడ్స్ లిమిటెడ్ పామ్ ఆయిల్ కంపెనీ వారి ఆధ్వర్యంలో గ్రామం లోని రైతులకు పామ్ ఆయిల్ మొక్కల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో అత్యధిక సంఖ్యలో పామ్ ఆయిల్ పంట సాగు చేసే నియోజకవర్గంలో జగ్గంపేట నియోజకవర్గం ముందు వరుసలో ఉంటుందని, ఇక్కడి రైతులు పామ్ ఆయిల్ సాగులో చాలా అనుభవం కలిగిన వారిని తెలియచేసారు. మిగిలిన రైతులు కూడా పామ్ ఆయిల్ సాగు చేస్తూ మంచి ఆదాయం పొందాలని ఆకాంక్షించారు. పామ్ ఆయిల్ పంట రైతులకు 100 సంవత్సరాలు పలశయం ఇచ్చే పంట అని, రాబోవు కాలంలో గోకవరం మండలంలో నీటి పారుదలకు సంబంధించి భూపతిపాలెం, ముసురిమిల్లి, సురంపాలెం ప్రాజెక్ట్ లను అనుసంధానం చేస్తామని తద్వారా నీటి సమస్య లేకుండా చేస్తామని తెలియజేశారు. పెద్దాపురం ఫ్యాక్టరీ పరిధిలో రైతులు అందరూ మంచి సదుపాయాలు పొందుతున్నారని చెప్పారు. పతంజలి సంస్ద ప్లాంటేషన్ విభాగాధిపతి అయిన వి పట్టాభిరామి రెడ్డి, ప్రసంగిస్తూ పతంజలి యాజమాన్యం ఎల్లప్పుడూ రైతు శ్రేయస్సునే కరుకుంటుందని, రైతులకు సేవ చేయటంలో లాభాపేక్షకు పోకుండా ఎన్నో నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతోందని తెలియజేశారు. ఈ పంట వలన రైతులు ఆర్దికంగా సుస్థిరత సాధించడం చాలా ఆనందంగా ఉందని చెప్పారు, ఆయిల్ పామ్ సాగు చేస్తున్న ప్రతి రైతు విదేశీ మారకనిల్వలు కాపాడుతూ దేశానికి సేవ చేస్తున్నారని చెప్పారు. జిల్లా ఉద్యాన అధికారి ఎన్ మల్లికార్జునరావు ప్రసంగిస్తూ దేశంలో పామ్ ఆయిల్ సాగులో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంటుందని, ఈ పంట వల్ల చాలా మంది రైతులు లబ్ధి పొందుతున్నారని తెలియజేశారు. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ రాయితీలను గురించి వివరించారు. దేశంలో పామాయిల్ వినియోగంలో పోలిస్తే పండించే పంట 25%కు మించట్లేదని అందువలన పామ్ ఆయిల్ పంట అవసరం దేశానికి ఎక్కువగా ఉందని తెలియజేశారు. డిప్యూటీ జనరల్ మేనేజర్ ఏఎస్ ప్రకాష్ ప్రసంగిస్తూ పామ్ ఆయిల్ తోటల సాగులో గోకవరం మండలం లోని రైతులు అత్యధిక సంఖ్యలో ఆసక్తి చూపిస్తున్నారని, అధిక సంఖ్యలో రైతులు 30 నెలలకే గెలలు కొడుతున్నారని, క్రొత్త విధానాలు అవలంబించడం, సాగులో యాంత్రీకరణ పద్దతులు తీసుకురావటం వలన రైతులు అత్యధిక ఆదాయం పొందుతున్నారని మరియు ఇక్కడి సారవంతమైన నేలలు పామ్ ఆయిల్ పంటకు అత్యంత అనుకూలంగా ఉంటాయి అని చెప్పారు అదేవిధంగా పామ్ ఆయిల్ పంట అందరి రైతులకు అనుకూలమైన పంట అని, మన సంస్థ పరిధిలో అర్ధ ఎకరా రైతు నుండి 100 ఎకరాలు పైబడి సాగు చేస్తున్న రైతులు ఉన్నారని తెలియజేశారు. హార్టికల్చర్ అధికారి శ్రీమతి రిని మాట్లాడుతూ కోరుకోడ, గోకవరం మరియు సీతానగరం మండలలో 150 హెక్టార్లలో పామ్ ఆయిల్ మొక్కలు ప్రస్తుత 2025 – 26 సంవత్సరంలో నాటి ఉన్నారని, ప్రభుత్వం1 హెక్టార్లలో మొక్కలు కు 29000 రూపాయలు, ఎరువులు రూపంలో మొదటి నాలుగు సంవత్సరాలకు 21000 రూపాయలు అందచేస్తున్నదని మరియు అంతరపంటల రూపంలో మరియొక 21000 రూపాయలు అందచేస్తోందని చెప్పారు. వివిధ రకములైన ప్రోత్సాహకాలు మరియు సూక్ష్మ సేద్యం లో ఇస్తున్న రాయితీలు గురించి రైతులకు వివరించారు. అదేవిధంగా డ్రిప్ ద్వారా తోటకు ఎరువులు పెట్టుట వలన ఉపయోగాలను వివరించారు. కార్యక్రమంలో గోకవరం విశాల సహకార పరపతి సంఘం గాజింగం సత్యనారాయణ, జగ్గంపేట మార్కెట్ యార్డ్ చైర్మన్ అడపా భారత్,పతంజలి ఫుడ్స్ లిమిటెడ్ సీనియర్ ఫీల్డ్ ఆఫీసర్ డీఎస్ శ్రీనివాస్, ఫీల్డ్ ఆఫీసర్ కె కార్తీక్ రెడ్డి, క్లస్టర్ ఇంచార్జి డి ఉమామహేశ్వరరావు , ఫీల్డ్ సూపర్వైజర్ ఎస్ శివ, పతంజలి కంపెనీ సిబ్బంది మరియు అధిక సంఖ్యలో పామ్ఆయిల్ రైతులు పాల్గొన్నారు.

తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

రచయిత నుండి మరిన్ని

సంబంధిత వార్తలు

For Ads
ఆంధ్రప్రదేశ్
అంబేద్కర్ కోనసీమ
సాధారణ వార్తలు
రాజకీయాలు
కాకినాడ
క్రైమ్ వాయిస్
విద్య వాయిస్
కిసాన్ వాయిస్
హెల్త్ వాయిస్
అలూరి సీతారామరాజు
ఆధ్యాత్మికం
సక్సెస్ వాయిస్
సినీ వాయిస్
తూర్పు గోదావరి
టెక్నాలజీ
కృష్ణా
తెలంగాణ
వనిత వాయిస్
బిజినెస్ వాయిస్
తీర్పు వాయిస్
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo