గండేపల్లి లో వాహనం సీజ్ ..ఇద్దరి వ్యక్తులు అరెస్ట్
కాకినాడ జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ ఐపీఎస్ ఆదేశాల మేరకు గోవుల అక్రమ రవాణాను అరికట్టేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో గండేపల్లి ఎస్‌ఐ శివ నాగబాబు తన సిబ్బందితో కలిసి గండేపల్లి వద్ద వాహన తనిఖీలు చేపట్టారు.ఈ తనిఖీల భాగంగా తుని నుంచి చిలకలూరిపేటకు అక్రమంగా తరలిస్తున్న అశోక్ లేలాండ్ దోస్త్ వాహనాన్ని అడ్డగించారు. వాహనాన్ని పరిశీలించగా, అందులో నాలుగు ఆవు దూడలు, 12 ఎద్దు దూడలు అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించారు. పోలీసులు వెంటనే వాహనాన్ని సీజ్ చేసి, ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేయబడిందని జగ్గంపేట సర్కిల్ ఇన్‌స్పెక్టర్ వై.ఆర్.కె. శ్రీనివాస్ తెలిపారు .ఈ చర్యలతో గోవుల అక్రమ రవాణాపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటువంటి చట్టవిరుద్ధ చర్యలకు పాల్పడిన వారిపై చర్యలు తప్పవని జగ్గంపేట సి ఐ వై ఆర్ కె శ్రీనివాస్ హెచ్చరిస్తున్నారు.