Wednesday, August 6, 2025
🔔 10
Latest Notifications
Wednesday, August 6, 2025
🔔 10
Latest Notifications

ఘనంగా గోనేడ గ్రామంలో వంగవీటి రంగా జయంతి వేడుకలు

Share
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి

ముఖ్య అతిథిగా హాజరైన కిర్లంపూడి మండల జనసేన అధ్యక్షుడు ఉలిసి ఐరాజ్ మరియు కాప్స్ రాక్స్ సభ్యుడు మద్దూరి సత్యనారాయణ

 

జగ్గంపేట

జగ్గంపేట నియోజకవర్గం కిర్లంపూడి మండలం గోనేడ గ్రామంలో బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి, కాపు ఉద్యమ నాయకుడు స్వర్గీయ వంగవీటి మోహనరంగా 78వ జయంతి వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా వంగవీటి మోహనరంగా విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జనసేన కిర్లంపూడి మండల అధ్యక్షుడు ఉలిసి ఐ రాజ్ మాట్లాడుతూ, వంగవీటి రంగా సామాజిక సమానత్వానికి, కాపు సమాజ హక్కుల కోసం జీవితాన్ని అర్పించిన మహానేత అని పేర్కొన్నారు.కాప్ రాక్స్ సభ్యుడు మద్దూరి సత్యనారాయణ మాట్లాడుతూ, స్వర్గీయ వంగవీటి మోహన్ రంగ త్యాగాలు యువతకు ప్రేరణగా నిలుస్తాయని, ఆయనే కాపు సమాజ అభ్యున్నతికి మార్గదర్శి అని చెప్పారు. ఈ కార్యక్రమం లో గ్రామస్తులు, కాపు సంఘాల నాయకులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

రచయిత నుండి మరిన్ని

సంబంధిత వార్తలు

For Ads
ఆంధ్రప్రదేశ్
సాధారణ వార్తలు
అంబేద్కర్ కోనసీమ
కాకినాడ
రాజకీయాలు
క్రైమ్ వాయిస్
విద్య వాయిస్
కిసాన్ వాయిస్
హెల్త్ వాయిస్
అలూరి సీతారామరాజు
ఆధ్యాత్మికం
సినీ వాయిస్
సక్సెస్ వాయిస్
టెక్నాలజీ
క్రీడా వాయిస్
తీర్పు వాయిస్
తూర్పు గోదావరి
తెలంగాణ
వనిత వాయిస్
కృష్ణా
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo