జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్చార్జి తుమ్మలపల్లి రమేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.
తుమ్మలపల్లి రమేష్ జన్మదిన పురస్కరించుకుని శనివారం కిర్లంపూడి మండలం రామచంద్రపురం గ్రామంలోని రమేష్ స్వగృహం నందు జనసేన పార్టీ అభిమానులు కార్యకర్తల మధ్య భారీ కేకులను కట్ చేసి జన్మదిన వేడుకలు వైభవంగా జరిగాయి.ఈ కార్యక్రమంలో నియోజకవర్గం నలుమూలల నుంచి జనసేన పార్టీ, కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు, తుమ్మలపల్లి శేఖర్, రమేష్, చందు అభిమానులు పెద్ద ఎత్తున హాజరై తుమ్మలపల్లి రమేష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.పలువురు అభిమానులు పుస్తకాలు పెన్నులు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. మరి కొంతమంది పూల బొకేలు గజమాలు, శాలువాలతో తో సత్కరించి వారి వెంట తీసుకువచ్చిన కేకులను కట్ చేసి రమేష్ జన్మదిన వేడుకల్లో పాలుపంచుకున్నారు.వారి జన్మదినం సందర్భంగా తుమ్మలపల్లి రమేష్ రామచంద్రపురం గ్రామంలో మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలని కోరడం జరిగింది.అలాగే ప్రతి ఒక్కరు పుట్టినరోజులకు శుభకార్యాలకు మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణలో భాగస్వామ్యులు కావాలని అన్నారు .వచ్చిన ప్రతి ఒక్కరికి రమేష్ స్వగృహం నందు భోజనాలు ఏర్పాటు చేశారు..ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.