ఆశీస్సులు అందించిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ
కాకినాడ జిల్లా టిడిపి విభిన్న ప్రతిభ వంతుల అధ్యక్షులు మండపాక అప్పన్నదొర పుట్టినరోజు వేడుకలు అంగరంగ వైభవంగా శనివారం ఘనంగా నిర్వహించారు. జగ్గంపేట మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జీను మణిబాబు ఆధ్వర్యం లో స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి టీటీడీ బోర్డు మెంబర్, జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ముఖ్య అతిథిగా పాల్గొని కేకును కట్ చేసి తినిపించారు.జ్యోతుల నెహ్రూ ఆశీర్వాదాలు అప్పన్న దొర పొందాడు. ఈ సందర్భంగా అప్పన్న దొర మాట్లాడుతూ చిన్న కార్యకర్త నుంచి నియోజకవర్గ సోషల్ మీడియా కన్వీనర్ గా, కాకినాడ జిల్లా విభిన్న ప్రతిభవంతుల అధ్యక్షులుగా నన్ను నియమించిన తన ఆరాధ్య దైవం జ్యోతుల నెహ్రూ కి యువనేత, యంగ్ అండ్ డైనమిక్ లీడర్ జ్యోతు నవీన్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు. యువ కార్యకర్తలకు మార్గదర్శినిగా నిలిచిన మండల అధ్యక్షులు జీను మణిబాబుకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు.
ఈ కార్యక్రమంలో అభివృద్ధి కమిటీ డైరెక్టర్ మారిశెట్టి భద్రం, ఆర్యవైశ్య డైరెక్టర్ కొత్త కొండబాబు, టౌన్ టిడిపి అధ్యక్షులు పాండ్రంగి రాంబాబు, నియోజవర్గ యువత అధ్యక్షులు దేవరపల్లి మూర్తి, నియోజకవర్గ బ్రాహ్మణ సంఘం అధ్యక్షులువేములకొండ జోగారావు, మండల యువత అధ్యక్షులు రాయి సాయి, నియోజవర్గ యువత ఉపాధ్యక్షులు బద్ది సురేష్, దాపర్తి సీతారామయ్య, తాళ్లూరు సర్పంచ్ ఎస్ వీరబాబు, కొండ్రోతు శ్రీను, తూము కుమార్, కుర్ల చిన్నబాబు, కొత్త ప్రసాద్, కాళ్ల వెంకటేష్, కోడూరి రమేష్, గొల్లపల్లి శ్రీదేవి, షేక్ వల్లి, య ర్రంశెట్టి మణికంఠ, దార బల్ల గోవిందు, సద్గురు మూర్తి అధిక సంఖ్యలో టిడిపి నాయకులు పాల్గొన్నారు.