Saturday, August 2, 2025
Saturday, August 2, 2025

జగ్గంపేట పరిధిలో జూదక్రీడలు, అసాంఘిక కార్యకలాపాలపై పోలీసులు ఆకస్మిక తనిఖీలు

Share
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి

విశ్వం వాయిస్ న్యూస్, జగ్గంపేట

కాకినాడ జిల్లాలో ఎటువంటి జూదక్రీడలు మరియు అసాంఘిక కార్యకలాపాలకు తావు లేకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కాకినాడ జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్, ఐపీఎస్ ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో జగ్గంపేట సర్కిల్‌లో పోలీస్ విభాగం విజిలెంట్‌గా వ్యవహరిస్తోంది.ఆదేశాల ప్రకారం ఆదివారం జగ్గంపేట ఎస్‌ఐ రఘునందన్ రావు తన సిబ్బందితో కలిసి అనుమానిత ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో భాగం గా జగ్గంపేట బాలాజీ నగర్ ,టౌన్ హాల్ , కాకినాడ రోడ్ లో ఉన్న జగ్గంపేట ఎస్సార్ పెట్రోల్ బంక్ ,రాజపూడి రైస్ మిల్ వెనుక ఉన్న పామ్ ఆయిల్ తోట లో కీలక ప్రాంతాల్లో నిఘా పెంచి, స్థానిక సమాచారం ఆధారంగా తనిఖీలను చేపట్టారు.జగ్గంపేట సర్కిల్ పరిధిలో ఎవరైనా గుండాట, పేకాట, బొమ్మా బొరుసు, కోడి పందాలు, ఎత్తులాట, కోతా బంతి, క్రికెట్ బెట్టింగులు వంటి జూదక్రీడలు నిర్వహించినా లేదా బ్రోతల్ హౌస్‌లను నడిపించినా వారిపై కఠిన చర్యలు తప్పవనిస్పష్టం చేశారు.అలాంటి కార్యకలాపాలను గమనించినవారు వెంటనే జగ్గంపేట సి ఐ నంబర్ 94407 96529 లేదా ఎమర్జెన్సీ నంబర్లు 100 లేదా 112కు సమాచారం అందించాలని కోరారు. కాకినాడ జిల్లా పోలీస్ వాట్సాప్ నంబర్ 94949 33233కి కూడా సమాచారం ఇవ్వవచ్చు.అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడేవారిని ఉపేక్షించబోమని, చట్టపరమైన చర్యలు తప్పవని జగ్గంపేట సి ఐ వై ఆర్ కె శ్రీనివాస్ హెచ్చరించారు

తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

రచయిత నుండి మరిన్ని

సంబంధిత వార్తలు

For Ads
ఆంధ్రప్రదేశ్
అంబేద్కర్ కోనసీమ
సాధారణ వార్తలు
రాజకీయాలు
కాకినాడ
క్రైమ్ వాయిస్
విద్య వాయిస్
కిసాన్ వాయిస్
హెల్త్ వాయిస్
అలూరి సీతారామరాజు
ఆధ్యాత్మికం
సక్సెస్ వాయిస్
సినీ వాయిస్
తూర్పు గోదావరి
టెక్నాలజీ
కృష్ణా
తెలంగాణ
వనిత వాయిస్
బిజినెస్ వాయిస్
తీర్పు వాయిస్
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo