పలు కాలేజీలలో, స్కూల్స్ లో, ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయ జెండా ఆవిష్కరించిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ
కాకినాడ జిల్లా జగ్గంపేటలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ స్వతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్యఅతిథిగా జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ హాజరై ముందుగా పంచాయతీ కార్యాలయంలోనూ, ప్రభుత్వ హైస్కూల్లోనూ, ప్రభుత్వ జూనియర్ కళాశాలలోనూ, జగ్గంపేట మండల పరిషత్ కార్యాలయంలోనూ, వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలోనూ, ప్రభుత్వ మోడల్ డిగ్రీ కళాశాలలోనూ, బిఆర్ అంబేద్కర్ బాలికల గురుకుల పాఠశాలలోనూ, జగ్గంపేట టౌన్ హాల్ లోను జాతీయ జెండా ఆవిష్కరించి విద్యార్థులకు చాక్లెట్లు స్వీట్స్ బిస్కెట్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ ఎందరో స్వతంత్ర సమరయోధుల త్యాగఫలం వల్ల భారతదేశానికి స్వతంత్రం సిద్ధించిందని అన్నారు. పిల్లలు తమ బంగారు భవిష్యత్తు కోసం చక్కగా చదువుకుని ఉన్నత ఉద్యోగాలు సాధించి దేశాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపించాలని 100 సంవత్సరాల స్వతంత్ర దినోత్సవ నాటికి భారతదేశం ప్రపంచ అగ్ర దేశంగా ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్వీఎస్ అప్పలరాజు, మార్కెట్ కమిటీ చైర్మన్ అడపా భరత్, ఎంపీపీ అత్తులు నాగబాబు, మండల టిడిపి అధ్యక్షులు జీనుమణి బాబు, మారిశెట్టి భద్రం, కొత్త కొండబాబు, దేవరపల్లి మూర్తి, పాండ్రంకి రాంబాబు, పాలచర్ల నాగేంద్ర చౌదరి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బి శ్రీనివాస్, సర్పంచ్ బచ్చల నాగరత్నం, వేములకొండ జోగారావు, రాయి సాయి, ఎంపీడీవో కేవీఎస్ చంద్రశేఖర్, స్కూల్స్ కాలేజీ ల ప్రిన్సిపాల్ లు పాల్గొన్నారు.