సి ఐ వై ఆర్ కె శ్రీనివాస్
కాకినాడ జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్(ఐపీఎస్ )ఆదేశాల మేరకు జిల్లాలో ఎక్కడా క్రికెట్ బెట్టింగ్లు, కోడిపందాలు, బొమ్మ బొరుసు, గుండాటలు, ఎత్తులాట, కోతా బంతి వంటి జూద క్రీడలు జరగకుండా పోలీసు విభాగం కఠిన చర్యలు చేపడుతోంది.ఈ క్రమంలో శనివారం గండేపల్లి ఎస్సై శివ నాగబాబు సిబ్బందితో కలిసి గండేపల్లి గ్రామంలో పేకాట రాయుళ్లపై దాడి చేసి 5 మందిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.2,850 స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.జగ్గంపేట సర్కిల్ పరిధిలో ఎవరైనా జూద క్రీడలకు పాల్పడితే వెంటనే 100, 112, మొబైల్ నంబర్ 94407 96529, లేదా పోలీస్ వాట్సాప్ నంబర్ 94949 33233 కు సమాచారం అందించాలని జగ్గంపేట సి.ఐ వై.ఆర్.కె. శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు.