కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఐపీఎస్ చేతుల మీదుగా జగ్గంపేట సీఐ వై.ఆర్.కె. శ్రీనివాస్ ఉత్తమ సేవ పురస్కారం పత్రాన్ని అందుకున్నారు.విధి నిర్వహణలో చూపిన నిబద్ధత, సేవా తత్పరతకు గుర్తింపుగా జిల్లా ఎస్పీ పలువురు పోలీసు అధికారులకు ప్రశంసా పత్రాలను అందజేశారు.ఈ సందర్భంలో ఎస్పీ బిందు మాధవ్, ఉత్తమ సేవలందించినందుకు జగ్గంపేట సిఐ ను ప్రత్యేకంగా అభినందించారు.ఈ అవార్డు అందుకున్నందుకు స్థానికులు, సహచరులు సి ఐ వై ఆర్ కె కు హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలిపారు.

