Monday, August 4, 2025
Monday, August 4, 2025

జగ్గంపేటలో సార్వత్రిక సమ్మె విజయవంతం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో బంద్‌కు విశేష స్పందన

Share
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి

విశ్వం వాయిస్ న్యూస్, జగ్గంపేట

జూలై 9న జాతీయ కార్మిక సంఘాల పిలుపు మేరకు దేశవ్యాప్తంగా జరిగిన సార్వత్రిక సమ్మెకు జగ్గంపేటలో విశేష స్పందన లభించింది. కార్మిక, ఉద్యోగ, రైతు వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ నిర్వహించిన బంద్ విజయవంతంగా కొనసాగినట్లు ప్రజా సంఘాల నేతలు వెల్లడించారు.ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు-కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్నాకుల వీరాంజనేయులు, ఐఎఫ్టీయూ జాతీయ నాయకుడు వి.చిట్టిబాబు మాట్లాడుతూ, “కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాల వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది,” అన్నారు. మోదీ ప్రభుత్వం స్వదేశీ నినాదాల మాటలతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ ప్రభుత్వ రంగ సంస్థలు, రక్షణ రంగం, ఆయిల్ కంపెనీలు, విమానాశ్రయాలు, రైల్వేలు, విశాఖ ఉక్కు వంటి ప్రాజెక్టులను కార్పొరేట్ శక్తులకు తాకట్టు పెడుతుందని వారు విమర్శించారు.వారు చెప్పిన ప్రకారం, కార్మిక హక్కుల్ని కాలరాసేలా 44 కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్‌లుగా మార్చిన కేంద్ర ప్రభుత్వం, కార్మికులను ఆర్థిక, సామాజిక రక్షణల నుండి కుట్ర చేస్తోందని పేర్కొన్నారు.సమ్మె సందర్భంగా జగ్గంపేటలో జేవియర్ కాంప్లెక్స్ నుండి ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు ప్రదర్శనలు నిర్వహించబడగా, కాకినాడ రోడ్డులోని కార్పొరేషన్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్, పోస్టాఫీస్ లాంటి ప్రభుత్వ సంస్థల వద్ద బంద్ నిర్వహించారు. ఆర్టీసీ కాంప్లెక్స్ రోడ్డులో రాస్తారోకో కూడా నిర్వహించారు.ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన “నల్ల చట్టాలు”ను వెంటనే రద్దు చేయాలని, మధ్య భారత అడవుల్లో జరుగుతున్న ఆపరేషన్ కగార్‌ను నిలిపివేసి మావోయిస్టు పార్టీతో శాంతి చర్చలు జరపాలని వారు డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ఏపీఆర్సీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి బి.రమేష్, సీపీఐ (ఎంఎల్) లిబరేషన్ నాయకులు జె.రాజు, అచ్చరావు, పిడిఎస్యూవీ రాష్ట్ర కార్యదర్శి కడితి సతీష్, ఎఐకేఎంఎస్ జిల్లా కమిటీ సభ్యులు కే.బాబు రావు, సత్యనారాయణ, ఏపీఆర్సీఎస్ జిల్లా నాయకులు కె.రామలింగేశ్వర రావు, పిడిఎస్యూ జిల్లా అధ్యక్షురాలు మయూరి, ఎస్.రామిరెడ్డి, డాన్ శీను, సోమరాజు తదితరులు పాల్గొన్నారు.

తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

రచయిత నుండి మరిన్ని

సంబంధిత వార్తలు

For Ads
ఆంధ్రప్రదేశ్
అంబేద్కర్ కోనసీమ
సాధారణ వార్తలు
కాకినాడ
రాజకీయాలు
క్రైమ్ వాయిస్
విద్య వాయిస్
కిసాన్ వాయిస్
హెల్త్ వాయిస్
అలూరి సీతారామరాజు
ఆధ్యాత్మికం
సక్సెస్ వాయిస్
సినీ వాయిస్
తూర్పు గోదావరి
టెక్నాలజీ
కృష్ణా
తెలంగాణ
క్రీడా వాయిస్
వనిత వాయిస్
బిజినెస్ వాయిస్
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo