29 November 2025
Saturday, November 29, 2025

జీరో బ్యాలెన్స్ షార్ట్ ఫిల్మ్ రిలీజ్ చేసిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ

Share
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి

విశ్వం వాయిస్ న్యూస్, జగ్గంపేట

కాకినాడ జిల్లా గోకవరం మండలం మల్లవరం గ్రామానికి చెందిన మరిసే దుర్గాప్రసాద్ హైదరాబాదులో ఫిలిం ఇండస్ట్రీలో గత 6 సంవత్సరాలుగా పనిచేసి అనుభవం పొంది, జీరో బ్యాలెన్స్ ఇండిపెండెంట్ షార్ట్ మూవీనీ దర్శకత్వం వహించారు. ఆగస్టు 25వ తేదీన జగ్గంపేట ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ చేతుల మీదుగా షార్ట్ మూవీని ప్రారంభించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ దుర్గాప్రసాద్ మాట్లాడుతూ తనకు వైబ్రేజ్ ఎంటర్టైన్మెంట్ అధినేత అందూరి శీను సినిమా అవకాశం ఇచ్చారని , నన్ను ముందు ఒక షార్ట్ ఫిలిం తీయమని కోరడంతో సీనియర్ నటులు, నూతన నటులతో జీరో బ్యాలెన్స్ అనే ఈ షార్ట్ మూవీనీ తీయడం జరిగిందని ఈరోజు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ చేతుల మీదుగా ప్రారంభిస్తున్నామని ఈ షార్ట్ మూవీ ని అందరూ సోషల్ మీడియాలో చూసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుచున్నానని మీ ప్రాంత వాసిగా సినీ ఇండస్ట్రీలో నిలదొక్కునేందుకు మీ అందరి సహాయ సహకారాలు కావాలని ఆయన కోరారు. ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ మంచి మెసేజ్ ఉన్న షార్ట్ మూవీ తీశారని ఈ రోజుల్లో జరుగుతున్న ఆన్లైన్ మోసాలను కళ్ళకు కట్టినట్టుగా చూపించారని దుర్గాప్రసాద్ సినీ రంగంలో అగ్ర దర్శకుల్లో ఒక దర్శకుడిగా పేరు తెచ్చుకుని ఈ ప్రాంతానికి మంచి పేరు తీసుకురావాలని దుర్గాప్రసాద్ దీవించారు. ఈ కార్యక్రమంలో జీను మణిబాబు, మారిశెట్టి భద్రం, బుర్రి సత్తిబాబు, మల్లవరం సర్పంచ్ యిడుదుల అర్జునరావు, రాయి సాయి, మరిసే సత్యనారాయణ, యిడుదుల సూరిబాబు,యిడుదుల వీరబాబు, ఇంటి గణేష్ ,అందే రాజీవ్ తదితరులు పాల్గొన్నారు.

తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

రచయిత నుండి మరిన్ని

సంబంధిత వార్తలు

For Ads
ఆంధ్రప్రదేశ్
అంబేద్కర్ కోనసీమ
సాధారణ వార్తలు
కాకినాడ
రాజకీయాలు
క్రైమ్ వాయిస్
తూర్పు గోదావరి
విద్య వాయిస్
ఆధ్యాత్మికం
కిసాన్ వాయిస్
హెల్త్ వాయిస్
పండుగలు
సక్సెస్ వాయిస్
అలూరి సీతారామరాజు
తెలంగాణ
సినీ వాయిస్
క్రీడా వాయిస్
ఎడిటర్ వాయిస్
టెక్నాలజీ
తీర్పు వాయిస్
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo