01 December 2025
🔔 0
Latest Notifications
  • No posts found for today or yesterday.
Monday, December 1, 2025
🔔 0
Latest Notifications
  • No posts found for today or yesterday.

జూద క్రీడలపై జగ్గంపేట పోలీసులు ఉక్కుపాదం

Share
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి

ముగ్గురు పేకాట రాయుళ్లు అరెస్ట్

విశ్వం వాయిస్ న్యూస్, జగ్గంపేట

కాకినాడ జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్(ఐ.పి.ఎస్ )జిల్లా వ్యాప్తంగా జూదక్రీడలపై ఉక్కుపాదం మోపాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.ఆ ఆదేశాల మేరకు, జగ్గంపేట సీఐ వై.ఆర్.కె. కు అందిన విశ్వసనీయ సమాచారంతో, ఎస్‌ఐ శ్రఘునందన్ రావు మరియు సిబ్బందితో కలిసి కాట్రావులపల్లి గ్రామ శివారులో గరువు చెరువు ప్రాంతంలో పేకాట ఆడుతున్న ముగ్గురు వ్యక్తులపై ఆకస్మిక దాడి నిర్వహించారు. దాడిలో ముగ్గురు పేకాట రాయుళ్లను అరెస్ట్ చేసి, వారి వద్ద నుండి రూ. 5,150/- నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశారు.అదే విధంగా, జగ్గంపేట శివారులోని స్మశానవాటిక వద్ద, చట్టానికి విరుద్ధంగా మద్యం దాచిన వ్యక్తిపై చర్యలు తీసుకున్నారు. చైల్డ్ ఇన్ కాన్‌ఫ్లిక్ట్ విత్ లా (CICL) కింద ఉన్న ఒక నిందితుడిని అరెస్ట్ చేసి, అతని వద్ద నుండి 1.640 లీటర్ల మద్యం బాటిల్స్ స్వాధీనం చేసుకున్నారు. సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.జగ్గంపేట సర్కిల్ పరిధిలో ఎవ్వరైనా జూదక్రీడలు లేదా ఇతర అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినట్లు సమాచారం ఉంటే, ప్రజలు సమాచారం అందించాలని జగ్గంపేట సి ఐ వై ఆర్ కె శ్రీనివాస్ కోరుతున్నారు.

సంప్రదించవలసిన నెంబర్లు:

📞 జగ్గంపేట సి ఐ : 94407 96529
📞 పోలీసు కంట్రోల్ రూమ్: 100 / 112
📞 కాకినాడ జిల్లా పోలీస్ వాట్సాప్ నెంబర్: 94949 3323

తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

రచయిత నుండి మరిన్ని

సంబంధిత వార్తలు

For Ads
ఆంధ్రప్రదేశ్
అంబేద్కర్ కోనసీమ
సాధారణ వార్తలు
కాకినాడ
రాజకీయాలు
క్రైమ్ వాయిస్
తూర్పు గోదావరి
విద్య వాయిస్
ఆధ్యాత్మికం
కిసాన్ వాయిస్
హెల్త్ వాయిస్
పండుగలు
సక్సెస్ వాయిస్
అలూరి సీతారామరాజు
తెలంగాణ
సినీ వాయిస్
క్రీడా వాయిస్
ఎడిటర్ వాయిస్
టెక్నాలజీ
తీర్పు వాయిస్
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo