29 November 2025
Saturday, November 29, 2025

జేవిఆర్ సెంటర్ వద్ద బ్రిడ్జి తప్పనిసరి

Share
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి

నేషనల్ హైవే అథారిటీకి ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ డిమాండ్

జేవీఆర్ జంక్షన్ ప్రమాదాలకి బ్లాక్ స్పాట్

విశ్వం వాయిస్ న్యూస్, జగ్గంపేట

కాకినాడ జిల్లా జగ్గంపేట స్థానిక రావులమ్మ నగర్ లోని టిడిపి కార్యాలయంలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మీడియా సమావేశంలో మాట్లాడుతూ జగ్గంపేట నియోజకవర్గంలో 16వ నెంబర్ జాతీయ రహదారి గండేపల్లి మండలం మురారి నుండి కిర్లంపూడి మండలం సోమవారం వరకు విస్తరించి ఉందని ఈ రహదారి వల్ల మన ప్రాంతం అభివృద్ధి చెందడంతో పాటు రోడ్డు గడచిన కాలంలో 30 వేల ప్రమాదాలు ఆ ప్రమాదాల వల్ల ఐదు వేలకు పైగా ప్రజలు చనిపోతున్నారని , ముఖ్యంగా 2003 వ సంవత్సరంలో నాలుగు లైన్ల జాతీయ రహదారి నిర్మాణంలో గండేపల్లి వద్ద అండర్ పాస్ బ్రిడ్జి నిర్మాణాన్ని ఒక వ్యక్తి నిలుపుదల చేసినందు వలన అదే వ్యక్తి కుటుంబం లో తర్వాత కాలంలో అదే చోట 11 మంది రోడ్డు ప్రమాదంలో మరణించారని అన్నారు. ముఖ్యంగా జేవిఆర్ సెంటర్లో రోజు ప్రమాదాలను బారిన పడి అనేక మంది చనిపోతున్నారని కొద్ది రోజుల కిందట బలబద్రపురం గ్రామానికి చెందిన వ్యక్తి కూడా చనిపోవడం జరిగిందని, జేవిఆర్ సెంటర్ దాటిన తర్వాత వే బ్రిడ్జి వద్ద అండర్ పాస్ బ్రిడ్జి త్వరీత గతిన పూర్తిచేసి, ప్రమాదాలు నివారించేందుకు నేషనల్ హైవే అథారిటీ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా జగ్గంపేట ప్లే ఓవర్ బ్రిడ్జికి అటు ఇటు ఉన్న సర్వీస్ అప్రోచ్ రోడ్లు డబల్ రోడ్లుగా విస్తరించి ట్రాఫిక్ జామ్ ను తగ్గించాలని అన్నారు. ఈ విషయంపై నేషనల్ హైవే అథారిటీ వారు తక్షణం స్పందించాలని అదేవిధంగా కేంద్రమంత్రి నితిన్ గత్కారి, ముఖ్యమంత్రి చంద్రబాబు కి వినతి పత్రం అందజేస్తామని అదేవిధంగా సమస్య పరిష్కారానికి కృషి చేయాలని నెహ్రూ అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ వి ఎస్ అప్పలరాజు, జీను మణిబాబు, కొత్త కొండబాబు, దేవరపల్లి మూర్తి, కుంచే తాతాజీ, బద్ది సురేష్, పిలా మహేష్ తదితరులు పాల్గొన్నారు.

తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

రచయిత నుండి మరిన్ని

సంబంధిత వార్తలు

For Ads
ఆంధ్రప్రదేశ్
అంబేద్కర్ కోనసీమ
సాధారణ వార్తలు
కాకినాడ
రాజకీయాలు
క్రైమ్ వాయిస్
తూర్పు గోదావరి
విద్య వాయిస్
ఆధ్యాత్మికం
కిసాన్ వాయిస్
హెల్త్ వాయిస్
పండుగలు
సక్సెస్ వాయిస్
అలూరి సీతారామరాజు
తెలంగాణ
సినీ వాయిస్
క్రీడా వాయిస్
ఎడిటర్ వాయిస్
టెక్నాలజీ
తీర్పు వాయిస్
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo