Monday, August 4, 2025
Monday, August 4, 2025

జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జగ్గంపేటలో నిర్వహించిన మెగా జాబ్ మేళాకు విశేష స్పందన

Share
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి

జగ్గంపేట

స్థానిక గోకవరం రోడ్డులోని మోడ్రన్ డిగ్రీ కళాశాలలో జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్, వికాస ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన మెగా జాబ్ మేళా కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. ముందుగా కాకినాడ జిల్లా టిడిపి అధ్యక్షులు జ్యోతులనవీన్ హాజరై వచ్చిన అభ్యర్థుల అందర్నీ పేరుపేరునా పలకరించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం నిర్వహించిన సభలో వికాస పీడీ లక్ష్మణరావు మాట్లాడుతూ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, జ్యోతుల నవీన్ ఆధ్వర్యంలో జగ్గంపేట నియోజకవర్గం నిరుద్యోగులందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించాలని 33 బ్రాండెడ్ కంపెనీలతో నిర్వహించిన ఈ మెగా జాబ్ మేళాకు 1206 అభ్యర్థుల హాజరై ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. దాదాపు 729 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగిందని తెలియజేశారు.  జ్యోతుల నవీన్ మాట్లాడుతూ నియోజవర్గంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని వికాస ఆధ్వర్యంలో ఈ యొక్క మెగా జాబ్ మేళా ఏర్పాటు చేయడం జరిగిందని ఈ జాబ్ మేళా ఉపయోగించుకుని  ఉద్యోగ అవకాశాలు పొందాలని అన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ వికాస ఆధ్వర్యంలో లక్ష్మణరావుని మెగా జాబ్ మేళా ఏర్పాటు చేయడం జరిగిందని ఈ జాబ్ మేళా ప్రముఖ కంపెనీలు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నాయని ఈ ఇంటర్వ్యూలో పాల్గొని ఉద్యోగాలు అందిపుచ్చుకుంటే మీ తల్లిదండ్రులను ఆనందించే విధంగా మీరు ఏదో ఒక ఉద్యోగంలో జాయిన్ అవుతే మీ తల్లిదండ్రుల ఆనందానికి అవధులు ఉండవని అన్నారు. అందుకే ఈ చిరు ప్రయత్నం చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో అడపా భరత్ బాబు, తోట రవి, తోట గాంధీ, కొత్త కొండబాబు, అడబాల భాస్కరరావు, బస్వా వీరబాబు, మారిశెట్టి భద్రం, పోతుల మోహనరావు, చదరం చంటిబాబు, జంపన సీతారామచంద్ర వర్మ, నీలం శ్రీను, దేవరపల్లి మూర్తి, పాలచర్ల నాగేంద్ర చౌదరి, తూము కుమార్, తదితరులు పాల్గొన్నారు.

తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

రచయిత నుండి మరిన్ని

సంబంధిత వార్తలు

For Ads
ఆంధ్రప్రదేశ్
అంబేద్కర్ కోనసీమ
సాధారణ వార్తలు
కాకినాడ
రాజకీయాలు
క్రైమ్ వాయిస్
విద్య వాయిస్
కిసాన్ వాయిస్
హెల్త్ వాయిస్
అలూరి సీతారామరాజు
ఆధ్యాత్మికం
సక్సెస్ వాయిస్
సినీ వాయిస్
తూర్పు గోదావరి
టెక్నాలజీ
కృష్ణా
తెలంగాణ
క్రీడా వాయిస్
వనిత వాయిస్
బిజినెస్ వాయిస్
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo