పాటంశెట్టి సూర్యచంద్ర ..సామాజిక ఉద్యమకారుడు
అర్హత ఉన్నా మాకు తల్లికి వందనం రాకపోవడంతో గ్రామపంచాయతీ ఆఫీస్ వద్దకు, ఎలక్ట్రికల్ అధికారుల వద్దకు, రెవెన్యూ అధికారుల వద్దకు ఎన్నిసార్లు తిరిగినా మాకు న్యాయం జరగటం లేదని తల్లికి వందనం లబ్ధిపొందని కొందరు బాధితులు సామాజిక ఉద్యమకారుడు పాటంశెట్టి సూర్యచంద్రను ఆశ్రయించారు. బాధితులతో కలిసి జగ్గంపేట తహసీల్దార్ శ్రమేష్ ,ఎలక్ట్రికల్ ఏఈ మాధురి కలిసి తల్లికి వందనం సమస్యలు వెంటనే పరిష్కరించాలని సూర్యచంద్ర కోరారు.ఈ సందర్భంగా పాటంశెట్టి సూర్యచంద్ర మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ ఎన్నికల హామీలో భాగంగా తల్లికి వందనం ద్వారా బడికి వెళ్లే ప్రతి విద్యార్థికి 13 వేలు తల్లుల ఖాతాలో వేయడం అభినందనీయమని ఎంతోమంది తల్లులు ఆనందంతో ఉన్నారని కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.అర్హత ఉండి తల్లికి వందనం లబ్ధి పొందని అక్క,చెల్లెమ్మలు ప్రతి గ్రామంలోనూ సుమారు 10 నుండి 20 మంది ప్రతిరోజు ఆఫీసుల చుట్టూ కాళ్లు అరిగేలా తిరుగుతూ ఆవేదనతో ఆందోళన పడుతున్నారని,సమస్యల పరిష్కారం కోసం తల్లికి వందనం పెండింగ్ లిస్టులతో నాలుగు మండలాల్లో ఉన్న ఎలక్ట్రికల్, రెవెన్యూ అధికారులతో శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ సమావేశాన్ని ఏర్పాటు చేసి అర్హత ఉన్న మహిళలు ఆఫీసుల చుట్టూ తిరగకుండా తక్షణం సమస్యలు పరిష్కరించే విధంగా తగిన ఆదేశాలు ఇవ్వడంతో పాటు, అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి డబ్బులు పడే వరకు ప్రతివారం తల్లికి వందనం ప్రగతిపై సంబంధిత అధికారులతో రివ్యూ చేయడం ద్వారా నూరు శాతం జగ్గంపేట నియోజకవర్గంలో తల్లికి వందనం కార్యక్రమం విజయవంతం అవుతుందని పాటంశెట్టి సూర్యచంద్ర విజ్ఞప్తి చేశారు