Saturday, August 2, 2025
🔔 9
Latest Notifications
Saturday, August 2, 2025
🔔 9
Latest Notifications

తిరుమల ఇంగ్లీష్ మీడియం స్కూల్‌లో ఘనంగా పేరెంట్స్ డే సెలబ్రేషన్స్

Share
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి

విశ్వం వాయిస్ న్యూస్, జగ్గంపేట

కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం దివిలి గ్రామంలో ఉన్న తిరుమల ఇంగ్లీష్ మీడియం స్కూల్‌లో శనివారం పేరెంట్స్ సెలబ్రేషన్ కార్యక్రమం ఎంతో ఉత్సాహభరితంగా నిర్వహించబడింది. ఈ వేడుకలో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమం స్కూల్ ప్రిన్సిపాల్ శ్రీమతి ఫెయిత్ ఏంజెల్ ఆధ్వర్యంలో అత్యంత శ్రద్ధతో నిర్వహించబడింది. ముఖ్య అతిథులుగా స్కూల్ కరెస్పాండెంట్ ఎం . నూకరాజు అకాడమిక్ డైరెక్టర్ ఎం .రాంబాబు,. మరియు కోఆర్డినేటర్ ఎస్. ప్రసాద్ హాజరై విద్యార్థులకు ప్రోత్సాహక మాటలు చెప్పారు.ఈ సందర్భంగా స్కూల్ కరెస్పాండెంట్ ఎం. నూకరాజు తల్లిదండ్రులు తమ పిల్లల చదువుపై చూపించే శ్రద్ధ, మాకు మంచి ప్రేరణగా ఉంటుంది. ప్రతి కుటుంబానికి విద్య విలువను చేరువ చేయడమే మా లక్ష్యం” అని స్పష్టం చేశారు.
అకాడమిక్ డైరెక్టర్ ఎం. రాంబాబు మాట్లాడుతూ
ఈ తరహా కార్యక్రమాలు విద్యార్థులలో చైతన్యం నింపుతాయి. విద్య కేవలం పాఠ్యగ్రంథాలకు మాత్రమే పరిమితం కాదు. వ్యక్తిత్వ వికాసానికి, నైపుణ్యాల అభివృద్ధికి ఇలాంటి కార్య‌క్ర‌మాలు ఎంతో దోహదం చేస్తాయి” అని చెప్పారు.
ప్రిన్సిపాల్ ఫెయిత్ ఏంజెల్ మాట్లాడుతూ తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు ఇద్దరూ కలిసి విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే శిల్పులు. ఈ సెలబ్రేషన్ మా విద్యార్థుల ప్రతిభను వారికీ పరిచయం చేయడమే కాకుండా, తల్లిదండ్రుల పాత్రకు కృతజ్ఞత తెలియజేసే వేదికగా నిలిచింది” అని పేర్కొన్నారు. కోఆర్డినేటర్ ఎస్. ప్రసాద్ మాట్లాడుతూ ఇలాంటి సెలబ్రేషన్లు తల్లిదండ్రులకు వారి పిల్లల అభివృద్ధి పట్ల ఆత్మవిశ్వాసం పెంపొందించేలా చేస్తాయి. తిరుమల స్కూల్ ప్రతి విద్యార్థిలోనూ ఉన్న ప్రత్యేకతను వెలికితీసే ప్రయత్నం చేస్తోంది” అని తెలిపారు.ఈ కార్యక్రమంలో విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు, డ్యాన్స్‌లు హాజరైన వారిని ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమం అనంతరం తల్లిదండ్రులకు వినూత్నంగా గౌరవం తెలిపారు. విద్యార్థులు తమ తల్లిదండ్రుల పాదాలను కడిగి, వారి మీద ప్రేమను వ్యక్తం చేశారు. అనంతరం వారు స్వయంగా తయారు చేసిన ‘పేరెంట్స్ డే గ్రీటింగ్స్’ను అందజేసి, తల్లిదండ్రుల ఆశీస్సులు పొందారు.

తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

రచయిత నుండి మరిన్ని

సంబంధిత వార్తలు

For Ads
ఆంధ్రప్రదేశ్
అంబేద్కర్ కోనసీమ
సాధారణ వార్తలు
కాకినాడ
రాజకీయాలు
క్రైమ్ వాయిస్
విద్య వాయిస్
కిసాన్ వాయిస్
హెల్త్ వాయిస్
అలూరి సీతారామరాజు
ఆధ్యాత్మికం
సక్సెస్ వాయిస్
సినీ వాయిస్
తూర్పు గోదావరి
టెక్నాలజీ
కృష్ణా
తెలంగాణ
వనిత వాయిస్
బిజినెస్ వాయిస్
తీర్పు వాయిస్
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo