జగ్గంపేట జీనుమణి బాబు
గండేపల్లి పోతుల మోహన రావు
కిర్లంపూడి వీరం రెడ్డి రామలింగేశ్వరరావు(కాశి బాబు)
గోకవరం పిల్ల అర్జున సారధి (చంటిబాబు)
కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం ఇర్రిపాక ఎమ్మెల్యే స్వగృహం నందు జగ్గంపేట నియోజకవర్గం సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన సుదీర్ఘ సమావేశంలో పార్టీ సంస్థాగత ఎన్నికలు కూడా నిర్వహించారు. జగ్గంపేట నియోజకవర్గం లోని జగ్గంపేట మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా జగ్గంపేట కు చెందిన జీను మణిబాబు, గండేపల్లి మండల అధ్యక్షుడుగా సింగం పాలెం కు చెందిన పోతుల మోహనరావు, కిర్లంపూడి మండల అధ్యక్షుడిగా భూపాలపట్నం కు చెందిన వీరం రెడ్డి రామలింగేశ్వరరావు ( కాశి బాబు), గోకవరం మండల అధ్యక్షుడిగా వెదురుపాక చెందిన పిల్ల అర్జునసారథి (చంటిబాబు) ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వీరందరూ మాట్లాడుతూ మాకు ఈ అవకాశం కల్పించిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ కు, జిల్లా టిడిపి అధ్యక్షులు జ్యోతుల నవీన్ కు నియోజకవర్గంలోని టిడిపి నాయకులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని పార్టీ కోసం అహర్నిశలు పని చేసి పార్టీని మరింత బలోపేతం చేస్తామని అన్నారు. ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాలని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆదేశాలతో తెలుగుదేశం పార్టీ మండల కమిటీలు అనుబంధ కమిటీలు ఏర్పాటు చేస్తున్నామని అందులో భాగంగా ఈరోజు మండల పార్టీ అధ్యక్షులను మండల కమిటీలను ప్రకటించడం జరిగిందని మంగళవారం అనుబంధ కమిటీలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు. నూతన పార్టీ అధ్యక్షులను ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాజీ సొసైటీ చైర్మన్ జ్యోతుల మణి దంపతులు, కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ , జ్యోతుల అనీష్ నెహ్రూ పలువురు ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జగ్గంపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.