Thursday, August 7, 2025
🔔 9
Latest Notifications
Thursday, August 7, 2025
🔔 9
Latest Notifications

నూతన సామాజిక ఆరోగ్య కేంద్రంలో పూర్తిస్థాయిలో వైద్య సేవలు ప్రారంభించిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ

Share
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి

విశ్వం వాయిస్ న్యూస్, జగ్గంపేట

కాకినాడ జిల్లా గండేపల్లి మండలం జెడ్ రాగం పేటలో జగ్గంపేట సామాజిక ఆరోగ్య కేంద్రం నూతనంగా నిర్మాణం చేసి ప్రారంభించుకోవడం జరిగింది. గురువారం ఈ సామాజిక ఆరోగ్య కేంద్రంలో పూర్తిస్థాయిలో వైద్య సేవలు అందుబాటులోకి తీసుకొచ్చిన జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ ముందుగా ఆస్పత్రికి చేరుకున్న ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ ఎమ్మెల్యేకు ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు పాండ్రంగి రాంబాబు, బొడ్డేటి సుమన్, నకిరేడ్డి సూర్యవతి టిడిపి నాయకులకు ఆరోగ్య కేంద్రం సూపర్డెంట్ డాక్టర్ ప్రణీత్ ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆసుపత్రిలో ఎమ్మెల్యే ఆన్ లైన్ ఓపి తీసుకుని వైద్య పరీక్షలు చేయించుకున్నారు. అనంతరం ఆసుపత్రిలోని వైద్యులు, నర్సులు సిబ్బంది తో సమావేశం నిర్వహించి ఆసుపత్రికి ఏమైనా సమస్యలు ఉంటే తెలుసుకుని ఇంకా ఎక్కడైనా ఇబ్బంది ఉంటే వాటిపైన దృష్టి పెట్టి వచ్చే రోగులకు పూర్తిస్థాయిలో వైద్యశాల అందించాలని అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నెహ్రూ మాట్లాడుతూ నూతన సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఈరోజు నుండి పూర్తిస్థాయిలో వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని అన్నారు. అన్ని రకాల ఆధునిక పరికరాలతో ఇక్కడ వైద్యం అందించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిందని అన్నారు. జగ్గంపేటకు దూరంగా హాస్పటల్ ఉంది అని ఒక విలేఖరి ప్రశ్నించగా హాస్పటల్ ఇటువంటి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉంటే రోగులు తొందరగా కోలుకుంటారని అన్నారు. జగ్గంపేట నుండి తొందర్లోనే ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యుడు పాండ్రంగి రాంబాబు వాహనాన్ని ఏర్పాటు చేసి ఉచితంగా ఆసుపత్రికి రోగులను తీసుకొచ్చేందుకు ఏర్పాటు చేస్తున్నారన్నారు. అంతేకాకుండా ఆటోలను కూడా తక్కువ చార్జీతో రోగులను ఇక్కడకు చేర్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్వీఎస్ అప్పలరాజు, గండేపల్లి, జగ్గంపేట మండల టిడిపి అధ్యక్షులు పోతుల మోహనరావు, జీను మణిబాబు, కొత్త కొండబాబు, కందుల చిట్టిబాబు, కందుల కొండయ్య చౌదరి (బాబ్జి), అడబాల వెంకటేశ్వరరావు, దేవరపల్లి మూర్తి, అనుకుల శ్రీకాంత్ పాలచర్ల నాగేంద్ర చౌదరి, వేములకొండ జోగారావు, బద్ది సురేష్, తదితరులు పాల్గొన్నారు.

తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

రచయిత నుండి మరిన్ని

సంబంధిత వార్తలు

For Ads
ఆంధ్రప్రదేశ్
సాధారణ వార్తలు
అంబేద్కర్ కోనసీమ
కాకినాడ
రాజకీయాలు
క్రైమ్ వాయిస్
విద్య వాయిస్
కిసాన్ వాయిస్
హెల్త్ వాయిస్
అలూరి సీతారామరాజు
ఆధ్యాత్మికం
సినీ వాయిస్
సక్సెస్ వాయిస్
టెక్నాలజీ
క్రీడా వాయిస్
తీర్పు వాయిస్
తెలంగాణ
తూర్పు గోదావరి
వనిత వాయిస్
బిజినెస్ వాయిస్
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo