జగన్ రెడ్డికి పులివెందుల ప్రజలు తగిన బుద్ధి చెప్పారు. ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ
పులివెందుల, ఒంటిమిట్ట జడ్పిటిసి ఫలితాల్లో ఘోర ఓటమి తో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ రెడ్డికి పులివెందుల ప్రజలు తగిన బుద్ధి చెప్పారని జోతుల నెహ్రూ కాకినాడ జిల్లా జగ్గంపేట టిడిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలియజేశారు. 30 సంవత్సరాలుగా ప్రజలను భయభ్రాంతులను చేస్తూ, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ ఎన్నికలు జరగకుండా చేసిన వారికి ప్రజలు స్వేచ్ఛ వాతావరణంలో ఓట్లు వేసి ప్రజాస్వామ్యాన్ని గెలిపించారని నెహ్రూ అన్నారు. తెలుగుదేశం పార్టీ ఏర్పడిన తర్వాత ఒకసారి ఎన్నికల్లో పోటీ చేస్తే అప్పుడు జడ్పిటిసి సభ్యుడిగా డాక్టర్ తులసిరెడ్డి గెలిచారని అనంతరం ఎన్నికలు జరగకుండా చేయడం జరిగిందని మళ్లీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్నికలు స్వేచ్ఛగా మహిళలు, ప్రజలు ఎన్నికలలో ఓట్లు వేసి జగన్మోహన్ రెడ్డి సొంత అడ్డా లో ఘోరంగా ఓడించారని ఇప్పటికైనా జగన్ రెడ్డి బుద్ధి తెచ్చుకుని మీ తండ్రి రాజకీయ చతురతలను నేర్చుకోమని నెహ్రూ సూచించారు. పులివెందులలో 685 ఓట్లు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి పడడం టిడిపికి 6000ఓట్లు పైబడి మెజార్టీతో గెలుపొందారని చంద్రబాబు తన సీనియార్టీ, వెజినరీ, పాలనతో రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్నారని ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్వీఎస్ అప్పలరాజు, అడపా భరత్, జీను మణిబాబు, మారిశెట్టి భద్రం, కొత్త కొండబాబు, దేవరపల్లి మూర్తి, పాండ్రంగి రాంబాబు, సర్వసిద్ధి లక్ష్మణరావు, వేములకొండ జోగారావు, ఎర్రబాబు, పిలా మహేష్ ,కర్నాకుల పెద్ద కాపు తదితరులు పాల్గొన్నారు.