22 October 2025
🔔 0
Latest Notifications
  • No posts found for today or yesterday.
Wednesday, October 22, 2025
🔔 0
Latest Notifications
  • No posts found for today or yesterday.

పేదల గుండెల్లో వై యస్ ఆర్ స్థానం సుస్థిరం .. ఒమ్మి రఘురాం

Share
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి

ఘనంగా వై యస్ ఆర్ 76 వ జయంతి వేడుకలు

విశ్వం వాయిస్ న్యూస్, జగ్గంపేట

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట చరిత్రలోనే కాక పేద ప్రజల గుండెల్లో దివంగత ముఖ్యమంత్రి వై యస్ రాజశేఖర్ రెడ్డి స్థానం సుస్థిరం అని పార్టీ సీనియర్ నేత, కాకినాడ జిల్లా బూత్ కమిటీల అధ్యక్షులు ఒమ్మి రఘురామ్ అన్నారు.మంగళవారం జగ్గంపేట నియోజకవర్గ కేంద్రంలో జగ్గంపేట జడ్పీటీసీ ఒమ్మి బిందుమాధవి ఆధ్వర్యంలో జరిగిన వై యస్ ఆర్ 76 వ జయంతి వేడుకల్లో ఒమ్మి రఘురామ్ ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడారు. ముందుగా జడ్పీటీసీ బిందుమాధవి, రఘురామ్ వై యస్ ఆర్ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. తదుపరి జగ్గంపేట ప్రధాన కూడలిలో మరియు గోకవరం రోడ్డులో గల వై యస్ ఆర్ విగ్రహాలకు పూలమాల వేసి కేక్ కట్ చేసి నాయకులకు కార్యకర్తలకు, వై యస్ ఆర్ అభిమానులకు శుభాకాంక్షలు తెలియ జేశారు. రఘురామ్ మాట్లాడుతూ వై యస్ ఆర్ జలయజ్ఞం ప్రాజెక్టులు, ఆరోగ్యశ్రీ, ఫీజు రీ ఎంబర్స్మెంట్,108,104, ఉచిత విద్యుత్, రెండు రూపాయల కిలో బియ్యం తదితర పథకాల ద్వారా పేద ప్రజలకు దైవం అయ్యారని అన్నారు. జగన్ మోహన్ రెడ్డిగారు కూడా తండ్రి బాటలో పయనిస్తూ తండ్రికి తగ్గ తనయునిగా ఖ్యాతి గడించారని అన్నారు. కార్యక్రమంలో ఎంపీటీసీలు గొల్లపల్లి పద్మా శ్రీను, చెరుకూరి మేరీ విజయ జయరాజ్, కొట్టు శివరామకృష్ణ,రెడ్డి భాను ప్రతాప్, నీలపల్లి అప్పారావు, కిలపర్తి వీరబాబు,దత్తి శ్రీనివాసు, మల్లువలస శ్రీహరి,కట్టు రాజు,వేమగిరి రవి కుమార్, కొల్లు ఏసు, కొల్లు రాంబాబు, కేతగిరి రఘురామ్, బొండు అమృతరావు, మట్టాడి రవి కుమార్, బత్తిన అశోక్, చెరుకూరి రాజు, నక్కా వీర బ్రహ్మం, మర్రి పృథ్వి రాజ్, ముక్కా నాగు, జాస్తి నాగబాబు, పూసి వసంత కుమార్, ఆదినారాయణ, మధు, సైనం మోషే, సారిపల్లి వీరబాబు, కొత్తపల్లి మల్లన్న, దాకే రాము తదితరులు పాల్గొన్నారు.

తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

రచయిత నుండి మరిన్ని

సంబంధిత వార్తలు

For Ads
ఆంధ్రప్రదేశ్
సాధారణ వార్తలు
అంబేద్కర్ కోనసీమ
కాకినాడ
రాజకీయాలు
క్రైమ్ వాయిస్
తూర్పు గోదావరి
విద్య వాయిస్
ఆధ్యాత్మికం
కిసాన్ వాయిస్
హెల్త్ వాయిస్
పండుగలు
సక్సెస్ వాయిస్
అలూరి సీతారామరాజు
తెలంగాణ
ఎడిటర్ వాయిస్
సినీ వాయిస్
టెక్నాలజీ
క్రీడా వాయిస్
తీర్పు వాయిస్
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo