Sunday, August 3, 2025
Sunday, August 3, 2025

ప్రజలకు సుపరిపాలన అందించడమే ప్రభుత్వ ఏకైక లక్ష్యం: ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ

Share
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి

గుర్రంపాలెంలో కుటమి ప్రభుత్వం ఏడాది సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం

విశ్వం వాయిస్ న్యూస్, జగ్గంపేట

సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం బుధవారం గుర్రంపాలెం గ్రామ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలోజరిగింది. ఈ కార్యక్రమానికి జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఎమ్మెల్యే నెహ్రూ ఇంటింటికి తిరిగి ప్రజలకు కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పధకాలు అందుతున్నాయా లేదా అని అడిగి తేలుసుకొని సమస్యలను తక్షణమై పరిష్కారించాలని అధికారులకు అదేశాలు జారిచేశారు. ఈ సందర్బంగా జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ గత వైసిపి ప్రభుత్వ పాలనలో రాష్ట్రాన్ని అర్దికసంక్షోభంలోకి నెట్టివేశాడని కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంక్షోభంలో ఉన్న ఏపీని సంక్షేమం దిశగా నడిపిస్తున్నారని అన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను సూపర్ సిక్స్ పథకాల ద్వారా ప్రతి ఇంట్లో వెలుగులు నింపేందుకు కూటమి ప్రభుత్వము కృషి చేస్తుందని తెలిపారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా తల్లికి వందనము అమలు చేశామని తెలిపారు. దేశంలో ఎక్కడ లేని విధంగా పెన్షన్ ఇస్తున్నామని తెలిపారు. నిరుపేద లేని సమాజ స్థాపనే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు లక్ష్యం అని తెలిపారు. పి4 విధానాన్ని రాష్ట్రంలో ప్రవేశపెట్టి పేదలను ఆదుకునే దిశగా కూటమి ప్రభుత్వము పనిచేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్వీఎస్ అప్పలరాజు, మారిశెట్టి భద్రం, కొత్త కొండబాబు, బస్వా చినబాబు, పడాల రాంబాబు, దాట్ల సూరిబాబు రాజు, పాలిశెట్టి సతీష్, పడాల బాలాజీ, పడాల ఈశ్వరరావు, షేక్ వల్లి, పోలం పద్దరాజు, పడాల విష్ణుమూర్తి, పడాల దుర్గ బాబు, పోండ్రు బాలనాగు, కూసుమంచి సత్యనారాయణ, కురందాసు భద్రరావు, కురుందాస్ వెంకన్న, తాతపూడి సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు.

తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

రచయిత నుండి మరిన్ని

సంబంధిత వార్తలు

For Ads
ఆంధ్రప్రదేశ్
అంబేద్కర్ కోనసీమ
సాధారణ వార్తలు
కాకినాడ
రాజకీయాలు
క్రైమ్ వాయిస్
విద్య వాయిస్
కిసాన్ వాయిస్
హెల్త్ వాయిస్
అలూరి సీతారామరాజు
ఆధ్యాత్మికం
సక్సెస్ వాయిస్
సినీ వాయిస్
తూర్పు గోదావరి
టెక్నాలజీ
కృష్ణా
తెలంగాణ
క్రీడా వాయిస్
వనిత వాయిస్
బిజినెస్ వాయిస్
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo