Sunday, August 3, 2025
🔔 9
Latest Notifications
Sunday, August 3, 2025
🔔 9
Latest Notifications

ప్రజా సమస్యల మీద నిబద్ధతతో పనిచేసేదీ ఎన్డీఏ కుటమి ప్రభుత్వం

Share
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి

జగంపేట మండలంలో 226 మందికి కొత్త పెన్షన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ

విశ్వం వాయిస్ న్యూస్, జగ్గంపేట

రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎన్టీఆర్ భరోసా కొత్త పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జగ్గంపేట మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో ఏవీఎస్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.మండలంలో భర్త చనిపోయిన భార్యలకు 226 మందికి నూతన పెన్షన్ లు అందజేశారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎమ్మెల్యే నెహ్రూ మాట్లాడుతూ గత పాలకులు రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాళా తీయించారని అయినా ఇచ్చిన మాట కట్టుబడి పార్టీలు కులాలకతీతంగా వృద్ధులకు, వితంతువులకు 4000 రూపాయలు, వికలాంగులకు 6000 రూపాయలు, తల సేమియా కిడ్నీ వ్యాధిగ్రస్తులకు పదివేల రూపాయలు, సంపూర్ణ వికలాంగులకు 15వేల రూపాయలు పెన్షన్లు ప్రతి నెల ఒకటవ తేదీనే వారి ఇంటికి వెళ్లి అధికారులు ప్రజాప్రతినిధులు అందిస్తున్నారని అన్నారు. గత పాలకుల నిర్లక్ష్యంతో 5 57 మంది మండలంలో భర్త చనిపోయిన మహిళలకు పెన్షన్ ఇవ్వవలసి ఉండగా 226 మందికి కొత్త పెన్షన్ పంపిణీ చేయడం జరిగింది అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు వారికి కూడా న్యాయం చేసే విధంగా వచ్చే నెలలో పెన్షన్లు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. అభివృద్ధి సంక్షేమాన్ని సమాంతరంగా ఈ ప్రభుత్వం అందిస్తుందని దానికి నిదర్శనమే జగ్గంపేట నియోజకవర్గంలో బీటీ రోడ్లు, సిమెంట్ రోడ్లు, ఇలా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ బీసీలకు ఆదరణ, ఎస్సీ ఎస్టీలకు ఆదుకునేందుకు అనేక కార్యక్రమాలు తీసుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్వీఎస్ అప్పలరాజు, మార్కెట్ కమిటీ చైర్మన్ అడపా భరత్, భర్త రాష్ట్ర ఆర్యవైశ్య డైరెక్టర్ కొత్త కొండబాబు, ఎంపీపీ నాగబాబు, మారిశెట్టి భద్రం, జగ్గంపేట, రాజపూడి సొసైటీ చైర్మన్లు బుర్రి సత్తిబాబు, ఉప్పలపాటి బుల్లబ్బ, దేవరపల్లి మూర్తి, అడబాల వెంకటేశ్వరరావు, ఎమ్మార్వో రమేష్, రేఖ బుల్లి రాజు, ముసిరెడ్డి నాగేశ్వరరావు, కంటే రామారావు, వేములకొండ జోగారావు, సర్పంచ్ లు భూసాల విష్ణుమూర్తి, సర్వసిద్ధి లక్ష్మణరావు, నీలం శ్రీను, పవిత్రమైన ఎంపిటిసిలు అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.

తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

రచయిత నుండి మరిన్ని

సంబంధిత వార్తలు

For Ads
ఆంధ్రప్రదేశ్
అంబేద్కర్ కోనసీమ
సాధారణ వార్తలు
కాకినాడ
రాజకీయాలు
క్రైమ్ వాయిస్
విద్య వాయిస్
కిసాన్ వాయిస్
హెల్త్ వాయిస్
అలూరి సీతారామరాజు
ఆధ్యాత్మికం
సక్సెస్ వాయిస్
సినీ వాయిస్
తూర్పు గోదావరి
టెక్నాలజీ
కృష్ణా
తెలంగాణ
వనిత వాయిస్
బిజినెస్ వాయిస్
తీర్పు వాయిస్
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo