Friday, August 8, 2025
🔔 9
Latest Notifications
Friday, August 8, 2025
🔔 9
Latest Notifications

ప్రతి ప్రభుత్వ ఉద్యోగి ఒక బంగారు కుటుంబానికి మార్గదర్శిగా మారాలి – కలెక్టర్ షణ్మోహన్

Share
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి

విశ్వం వాయిస్ న్యూస్, జగ్గంపేట

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పీ4 (పబ్లిక్-ప్రైవేట్-పీపుల్-పార్ట్నర్‌షిప్) కార్యక్రమం కింద కాకినాడ జిల్లాలో ఇప్పటివరకు 1.02 లక్షల బంగారు కుటుంబాలను గుర్తించినట్టు జిల్లా కలెక్టర్ షణ్మోహన్ వెల్లడించారు. పీ4 కార్యక్రమంలో భాగంగా బంగారు కుటుంబాలను స్వయంగా సందర్శించి, వారి సమస్యలను నేరుగా అడిగి తెలుసుకుంటూ కలెక్టర్ ఆదర్శంగా నిలుస్తున్నారు.మంగళవారం జరిగిన సందర్శనలో కలెక్టర్ షణ్మోహన్ పెద్దాపురం మండలం వడ్లమూరు గ్రామంలోని దొండపాటి చార్లెస్ కుటుంబం, జగ్గంపేట మండలం కాట్రావుపల్లి గ్రామంలో శాంతా నాగదుర్గ కుటుంబం, ప్రత్తిపాడు గ్రామంలోని మాదే రమణ కుటుంబాలను కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయా కుటుంబాలతో ఏకాంతంగా మాట్లాడి, వారి ఆర్థిక పరిస్థితి, విద్య, ఆరోగ్యం, నివాస పరిస్థితులు, విద్యుత్తు, నీటి సరఫరా, రేషన్ తదితర ప్రభుత్వ పథకాలు అందుతున్న విధానాన్ని పరిశీలించారు.ఈ సందర్బంగా వడ్లమూరు గ్రామంలో నరేగా కింద చేపట్టిన పండ్ల మొక్కలు నాటే కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రారంభించారు.జిల్లాలో బంగారు కుటుంబాల కోసం ప్రతి ఉద్యోగి మార్గదర్శిగా ఉండాలన్న ఉద్దేశంతో పీ4 కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నట్టు కలెక్టర్ తెలిపారు. “సాయం చేయగలిగే వారు మార్గదర్శులు, సాయం అవసరమైన వారు బంగారు కుటుంబాలుగా వ్యవహరించబడతారు. నేను వ్యక్తిగతంగా ఐదు బంగారు కుటుంబాలను స్వీకరించాను,” అని కలెక్టర్ పేర్కొన్నారు.ఈ నెల 15వ తేదీ కల్లా ప్రతి ప్రభుత్వ ఉద్యోగి కనీసం ఒక్క బంగారు కుటుంబాన్ని దత్తత తీసుకోవాలని లక్ష్యంగా పని చేస్తున్నట్టు వెల్లడించారు. ఇప్పటివరకు జిల్లాలో 1,710 బంగారు కుటుంబాలు మార్గదర్శుల ద్వారా దత్తత తీసుకోవడం జరిగింది. ఈ కుటుంబాల అవసరాలు, సమస్యలపై రెండు మూడు నెలల్లో ప్రణాళికా రూపకల్పన చేసి పేదరికాన్ని దూరం చేయడమే ఈ కార్యక్రమం లక్ష్యమన్నారు.ఈ కార్యక్రమంలో పెద్దాపురం ఆర్డీవో కె. శ్రీరమణి, జిల్లా ప్రణాళిక అధికారి పీ. త్రీనాథ్, బీసీ కార్పొరేషన్ ఈడీ ఎ. శ్రీనివాసు, తహశీల్దార్లు, ఎంపీడీవోలు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

రచయిత నుండి మరిన్ని

సంబంధిత వార్తలు

For Ads
ఆంధ్రప్రదేశ్
సాధారణ వార్తలు
అంబేద్కర్ కోనసీమ
కాకినాడ
రాజకీయాలు
క్రైమ్ వాయిస్
విద్య వాయిస్
కిసాన్ వాయిస్
హెల్త్ వాయిస్
అలూరి సీతారామరాజు
ఆధ్యాత్మికం
సినీ వాయిస్
సక్సెస్ వాయిస్
టెక్నాలజీ
క్రీడా వాయిస్
తీర్పు వాయిస్
తెలంగాణ
తూర్పు గోదావరి
వనిత వాయిస్
బిజినెస్ వాయిస్
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo