Sunday, August 3, 2025
Sunday, August 3, 2025

ప్రతిరోజు విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి

Share
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి

ఇర్రిపాకలో విద్యార్థులకు భోజనం వడ్డించిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ సతీమణి మణి

జగ్గంపేట

ప్రతిరోజూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడంపై ప్రత్యేక శ్రద్ధ చూపించాల్సిన అవసరం ఉందని జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ సతీమణి, జగ్గంపేట కో-ఆపరేటివ్ సొసైటీ మాజీ అధ్యక్షురాలు జ్యోతుల మణి అన్నారు.శుక్రవారం ఆమె జగ్గంపేట మండలంలోని ఇర్రిపాక గ్రామంలో ఉన్న జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు స్వయంగా భోజనం వడ్డిస్తూ, భోజన నాణ్యతను పరిశీలించారు. మధ్యాహ్న భోజనానికి ఉపయోగించే బియ్యం స్టాక్‌, వంటకు ఉపయోగించే పదార్థాలు, వంటగది పరిశుభ్రతపై సమగ్రంగా విచారణ జరిపారు.విద్యార్థులకు వడ్డించే భోజనంలో పురుగులు లేదా ఇతర అనారోగ్యకర అంశాలు ఉండకూడదని ఆమె స్పష్టం చేశారు. తరగతి గదులను పరిశీలించిన అనంతరం, ప్రస్తుతం పిల్లలకు అందుతున్న వసతులపై సంతృప్తి వ్యక్తం చేశారు.ఈ విద్యాసంవత్సరం ప్రారంభమైన నేపథ్యంలో, విద్యార్థులకు అందుతున్న వసతులను సమీక్షించేందుకు ఈ పాఠశాల సందర్శించాను అని ఆమె తెలిపారు.

తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

రచయిత నుండి మరిన్ని

సంబంధిత వార్తలు

For Ads
ఆంధ్రప్రదేశ్
అంబేద్కర్ కోనసీమ
సాధారణ వార్తలు
కాకినాడ
రాజకీయాలు
క్రైమ్ వాయిస్
విద్య వాయిస్
కిసాన్ వాయిస్
హెల్త్ వాయిస్
అలూరి సీతారామరాజు
ఆధ్యాత్మికం
సక్సెస్ వాయిస్
సినీ వాయిస్
తూర్పు గోదావరి
టెక్నాలజీ
కృష్ణా
తెలంగాణ
క్రీడా వాయిస్
వనిత వాయిస్
బిజినెస్ వాయిస్
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo