Saturday, August 2, 2025
🔔 10
Latest Notifications
Saturday, August 2, 2025
🔔 10
Latest Notifications

ప్రమాదవశాత్తు నీటిలో పడి మృతి చెందిన డేవిడ్ రాజు

Share
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి

విశ్వం వాయిస్ న్యూస్, జగ్గంపేట

జగ్గంపేట గ్రామానికి చెందిన డేవిడ్ రాజు (వయసు: 44 సంవత్సరాలు) అనే వ్యక్తి అనుకోని సంఘటనలో ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం ప్రకారం, గత ఆరు సంవత్సరాలుగా జగ్గంపేట పంచాయతీలో స్వీపర్‌గా విధులు నిర్వహిస్తున్న డేవిడ్ రాజు, తేదీ 29.07.2025 (మంగళవారం) సాయంత్రం పంచాయతీ పనులు ముగించుకుని ఇంటికి వెళ్లాడు.
అయితే, తేది 30.07.2025 (బుధవారం) మధ్యాహ్నం సుమారు 12:30 గంటల సమయంలో జగ్గంపేటలోని మంచినీటి చెరువులో ఆయన మృతదేహం కనిపించింది. అనుమానాస్పదంగా కనిపించిన ఈ ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న జగ్గంపేట ఎస్ఐ టి. రఘునాథరావు డేవిడ్ రాజు తల్లి ఎల్లె రత్నం ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అయితే పూర్తి వివరాలు పోస్ట్‌మార్టం నివేదిక రాకతో వెల్లడవుతాయని ఎస్సై తెలిపారు

తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

రచయిత నుండి మరిన్ని

సంబంధిత వార్తలు

For Ads
ఆంధ్రప్రదేశ్
అంబేద్కర్ కోనసీమ
సాధారణ వార్తలు
రాజకీయాలు
కాకినాడ
క్రైమ్ వాయిస్
విద్య వాయిస్
కిసాన్ వాయిస్
హెల్త్ వాయిస్
అలూరి సీతారామరాజు
ఆధ్యాత్మికం
సక్సెస్ వాయిస్
సినీ వాయిస్
తూర్పు గోదావరి
టెక్నాలజీ
కృష్ణా
తెలంగాణ
వనిత వాయిస్
బిజినెస్ వాయిస్
తీర్పు వాయిస్
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo