Sunday, August 3, 2025
Sunday, August 3, 2025

బాలికల రక్షణ పట్ల ప్రత్యేక శ్రద్ధ

Share
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి

జగ్గంపేట సిఐ వై ఆర్ కె శ్రీనివాస్

విశ్వం వాయిస్ న్యూస్, జగ్గంపేట

బాలికల రక్షణపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని జగ్గంపేట సీఐ వై ఆర్ కె శ్రీనివాస్ తెలిపారు. బుధవారం నాడు కిర్లంపూడి మండలంలోని వీరవరం గ్రామ ఉన్నత పాఠశాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులతో సమావేశమై బాలికల భద్రత, మానసిక ఆరోగ్యం, విద్యాసంబంధిత అంశాలపై చర్చించారు. డ్రగ్స్ వద్దు బ్రో’’ నినాదం ప్రభుత్వ ప్రాధాన్యతతో తీసుకువస్తున్న కార్యక్రమమని పేర్కొన్నారు. దీనిని కఠినంగా అమలు చేయాలనే ఉద్దేశంతో కాకినాడ జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ ఆదేశాలు అమలులో ఉన్నాయని తెలిపారు. పాఠశాలల 100 మీటర్ల పరిధిలో పొగాకు ఉత్పత్తుల విక్రయం, వినియోగం పూర్తిగా నిషేధించబడిందని, ఎవరు ఈ నిబంధనలను ఉల్లంఘించినా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.అలాగే ప్రతి పాఠశాలలో ఉపాధ్యాయులు, విద్యార్థుల సమన్వయంతో ‘‘ఈగల్ క్లబ్‌లు’’ ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ క్లబ్బులు విద్యార్థుల భద్రత, చైతన్యం, డ్రగ్స్ నివారణ తదితర కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

రచయిత నుండి మరిన్ని

సంబంధిత వార్తలు

For Ads
ఆంధ్రప్రదేశ్
అంబేద్కర్ కోనసీమ
సాధారణ వార్తలు
కాకినాడ
రాజకీయాలు
క్రైమ్ వాయిస్
విద్య వాయిస్
కిసాన్ వాయిస్
హెల్త్ వాయిస్
అలూరి సీతారామరాజు
ఆధ్యాత్మికం
సక్సెస్ వాయిస్
సినీ వాయిస్
తూర్పు గోదావరి
టెక్నాలజీ
కృష్ణా
తెలంగాణ
వనిత వాయిస్
బిజినెస్ వాయిస్
తీర్పు వాయిస్
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo