29 November 2025
Saturday, November 29, 2025

భవన నిర్మాణ కార్మిక సంఘం మహాసభల పోస్టర్ ఆవిష్కరించిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ

Share
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి

విశ్వం వాయిస్ న్యూస్, జగ్గంపేట

కాకినాడ జిల్లా జగ్గంపేట ఏపీ బిల్లింగ్ అండ్ అదర్ కన్స్ స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ సిఐటియు అనుభందం కాకినాడ జిల్లా రెండవ మహాసభలు సెప్టెంబర్ 30, అక్టోబర్ 1 రెండు రోజుల పాటు జరగనున్నాయని, ఈ సందర్బంగా మహాసభల పోస్టర్ ను స్థానిక రావులమ్మ నగర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ కార్మికుల ప్రయోజనాలకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, మహాసభలు జయప్రదానికి తన వంతు సహకారాలు పూర్తిస్థాయిలో అందిస్తానని హామీ ఇచ్చారు. ఈనెల 23వ తేదీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పర్యటన పెద్దాపురంలో జరుగుతున్న సందర్భంగా భవన నిర్మాణ కార్మికుల సమస్యలపై వినతిపత్రం అందించే ఏర్పాటును ఎమ్మెల్యే నెహ్రూ జిల్లా కలెక్టర్ సాగిలి మోహన్ తో చర్చించారు. ఈ సందర్భంగా సంఘం కాకినాడ జిల్లా ప్రధాన కార్యదర్శి రొంగల ఈశ్వరరావు, కార్యనిర్వాహక అధ్యక్షులు చెక్కల రాజ్ కుమార్ మాట్లాడుతూ 2020లో జగన్ ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాలను నిలుపుదల చేస్తూ తీవ్ర అన్యాయం చేశారన్నారు. అప్పటినుండి ఏ ప్రమాదంలో కార్మికుల చనిపోయినా కార్మికుని కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని, సంక్షేమ బోర్డు పథకాలు అమలులోకి వస్తే కొంతమేర కార్మికుల ప్రయోజనాలు నెరవేరుతాయని, తక్షణం సంక్షేమ బోర్డు అమలకు ఆటంకంగా ఉన్న జగన్ ఉత్తర్యులు 1214 మెమో సర్కులర్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. 2019 నుండి పెండింగ్ లో ఉన్న క్లైమూల పరిహారాలను కార్మికులకు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ కొత్తకొండ బాబు, శ్రీ వినాయక రావులమ్మతల్లి తాపిమేస్త్రి సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులు బోరా సత్తిబాబు, ప్రెసిడెంట్ కొల్లి సత్తిబాబు, సెక్రటరీ కెంగం దుర్గాప్రసాద్, వైస్ ప్రెసిడెంట్ కెంగం బుజ్జి, జనపరెడ్డి రమణ, పైడి యేసు, రామచంద్రపురం సత్తిబాబు, ఎలక్ట్రిషియన్ సంఘం ఈర్లు శ్రీను, సాయి విజయదుర్గ తాపీ మేస్త్రుల సంఘం ప్రెసిడెంట్ నగమళ్ల అన్నవరం తదితరులు పాల్గొన్నారు.

తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

రచయిత నుండి మరిన్ని

సంబంధిత వార్తలు

For Ads
ఆంధ్రప్రదేశ్
అంబేద్కర్ కోనసీమ
సాధారణ వార్తలు
కాకినాడ
రాజకీయాలు
క్రైమ్ వాయిస్
తూర్పు గోదావరి
విద్య వాయిస్
ఆధ్యాత్మికం
కిసాన్ వాయిస్
హెల్త్ వాయిస్
పండుగలు
సక్సెస్ వాయిస్
అలూరి సీతారామరాజు
తెలంగాణ
సినీ వాయిస్
క్రీడా వాయిస్
ఎడిటర్ వాయిస్
టెక్నాలజీ
తీర్పు వాయిస్
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo