కాకినాడ జిల్లా జగ్గంపేట మండల టిడిపి అధ్యక్షుడు జీనుమణి బాబు, మండల తెలుగు యువత అధ్యక్షులు రాయి సాయిలను స్థానిక జీవీఆర్ థియేటర్ వద్ద జగ్గంపేట కాపు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పూలమాలలో సాలువాలతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, జిల్లా టిడిపి అధ్యక్షులు, నియోజవర్గ అభివృద్ధి కమిటీ చైర్మన్ జ్యోతుల నవీన్ సహకారంతో కాపులకు ఏ సమస్య వచ్చిన పరిష్కరించి ప్రభుత్వం ద్వారా కాపు సంక్షేమానికి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జగ్గంపేట కాపు సంక్షేమ సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.

