స్థానిక రావులమ్మ నగర్ లోనితెలుగుదేశం పార్టీ కార్యాలయంలోజగ్గంపేట శెట్టి బలిజి గీత కార్మికుల సంఘం అధ్యక్షులు వాన శెట్టి సూరిబాబు, ఉపాధ్యక్షులు కుప్ప తాతారావు ఆధ్వర్యంలో జగ్గంపేట మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జీనుమణి బాబును ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా సూరిబాబు మాట్లాడుతూ మా శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ, జ్యోతుల నవీన్ ఆశీస్సులతో మండల టిడిపి అధ్యక్షుడిగా బాధ్యత స్వీకరించిన జీను మణిబాబుని ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశామని జగ్గంపేట సాంబా చెరువు వెళ్లే రోడ్డు అద్వానంగా ఉందని ఏటి కాలువకు కలవర్టు కట్టి రోడ్డు నిర్మాణం చేపట్టాలని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ కి తెలియజేసి పనులు ప్రారంభించాలని కోరారు. అదేవిధంగా టిడిపి ప్రభుత్వం హామీ ఇచ్చిన 50 సంవత్సరాలకే పింఛన్ పథకాన్ని కూడా తొందరలోనే ఏర్పాటు చేయాలని కోరారు. గీత కార్మికులకు ఆదరణ పథకంలో వాహనాలు పనిముట్లు అందజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాలిక అప్పారావు, పిల్లి శ్రీను, కుప్పా సింహాచలం, లావేటి శ్రీను, గొర్రెల రవణ, రాయుడు నాగేశ్వరరావు అధిక సంఖ్యలో గీత కార్మికులు పాల్గొన్నారు.

