నిర్లక్ష్యంగా చూస్తున్న అధికార యంత్రాంగం
కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో పెన్షన్ వ్యవస్థలో పెద్దఎత్తున అవకతవకలు వెలుగులోకి వస్తున్నాయి. అర్హతలు లేని వ్యక్తులు, ముఖ్యంగా దివ్యాంగులు కాక పోయిన ఉన్నట్టు వైద్యుల సర్టిఫికెట్లు డబ్బుతో మేనేజ్ చేసుకొని పెన్షన్లు పొందుతున్న దాఖలాలు బయటపడుతున్నాయి.
ప్రజా ధనం దోపిడీగా మారిన పెన్షన్ పథకం
ప్రజలకు సహాయం చేయడానికి ఉద్దేశించిన పెన్షన్ పథకాలు, కొంతమందికి అక్రమ ఆదాయ వనరుగా మారాయి. వైసీపీ ప్రభుత్వ కాలంలో ఈ దందా మరింత విస్తరించిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. క్రమంగా అర్హులు కాకపోయినా వందలాది మంది పెన్షన్లు పొందుతూ ప్రభుత్వ ఖజానా నుంచి లక్షల రూపాయలు అక్రమంగా దోచుకున్నట్లు సమాచారం.
అధికారులు చూసి చూడనట్టు?
ఈ అవకతవకలపై అధికారులకు సమాచారం లేకపోలేదు. అయితే పట్టించుకోకుండా చూసి చూడనట్టు వదిలేస్తున్నారన్న అభిప్రాయం ప్రజల్లో నెలకొంది. దీని ఫలితంగా గ్రామ స్థాయిలో పెన్షన్ వ్యవస్థ పట్ల విశ్వాసం దెబ్బతింటోంది.
రికాల్ ,రికవరీ డిమాండ్
ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ప్రజలు కొత్త కూటమి ప్రభుత్వాన్ని కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
• పెన్షన్ పొందుతున్న వారందరినీ రికాల్ చేసి తిరిగి మెడికల్ టెస్టులు చేయాలని
• నకిలీ సర్టిఫికెట్లతో దొంగగా పెన్షన్ పొందుతున్నవారిని గుర్తించి వెంటనే వారి పెన్షన్ రద్దు చేయాలని
• ఇప్పటి వరకు వారు అక్రమంగా పొందిన మొత్తాన్ని రికవరీ చేసి ప్రభుత్వ ఖజానాకు జమ చేయాలని
• అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రజల డిమాండ్ చేస్తున్నారు
కఠిన చర్యలపై ప్రజల ఆశ
అర్హులకు న్యాయం జరగాలి, అక్రమార్జకులకు శిక్ష పడాలి” అన్న డిమాండ్ జగ్గంపేట నియోజక వర్గం వ్యాప్తంగా వినిపిస్తోంది. ఇప్పటికైనా ప్రభుత్వం జోక్యం చేసుకొని అవకతవకలకు అడ్డుకట్ట వేయాలని ప్రజలు గట్టిగా కోరుతున్నారు.

