పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని రైతులు సద్వినియోగం చేసుకుని ఆధునిక వ్యవసాయ పద్ధతులను ఆవలంబించి తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు సాధించాలని వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు జి. శ్రీనివాస్ పిలుపునిచ్చారు.మంగళవారం జగ్గంపేట మండలం మల్లి శాల, కాండ్రేగుల గ్రామలలో పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని మండల వ్యవసాయ శాఖ అధికారి ఎస్ నరసింహ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు జి. శ్రీనివాస్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద ప్రతి ఒక్క రైతు ఇన్సూరెన్స్ చేయించుకోవాలని,అలాగే ప్రతి కౌలు రైతు కూడా తప్పనిసరిగా కౌలు కార్డులు తీసికోవాలని సూచించారు.దమ్ములో వేసుకోవలసిన ఎరువుల గురించి రైతలకు వివరించారు.రైతులకు గట్ల మీద వేసుకోవడానికి కంది విత్తనాలు పంపిణీ చేస్తున్నం అన్నారు. గ్రామాల్లో రైతు సేవా కేంద్రాల్లో యూరియా అందుబాటులో ఉందని రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో హార్టికల్చర్ అధికారి శ్రీ వల్లి, క్లస్టర్ ఇంచార్జ్ పైడిపాల సూరిబాబు, మల్లిశాల సర్పంచ్, సర్వసిద్ధి లక్ష్మణరావు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ గుమ్మల అనంతలక్ష్మి, సియా దుల పెద్దకాపు, వ్యవసాయ శాఖ గ్రామాధికారులు, మల్లి సాల, కాండ్రేగుల గ్రామాల రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.