చదువుకునే పిల్లలందరికీ తల్లికి వందనం ఇచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబు మాట నిలబెట్టుకున్నారని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ తెలిపారు.గోకవరం మండలం కామరాజుపేట గ్రామంలో గ్రామంలో సుపరిపాలన -తొలి అడుగు పేరిట ఎమ్మెల్యే,టిటిడి బోర్డు మెంబర్ జ్యోతుల నెహ్రూ ఇంటింటి ప్రచారంనిర్వహించారు.ఇంటింటికితిరుగుతూ ,కరపత్రాలు పంచుతూ చేసిన ఏడాది పాలనలో చేసిన అభివృద్ధి పనులను, అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు.గ్రామంలో మహిళలు, వృద్ధులు, దివ్యాంగుల తో మాట్లాడుతూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.ప్రభుత్వ పాలన పట్ల, ఎమ్మెల్యే పనితీరు పట్ల వారు సంతోషం వ్యక్తం చేశారు. రోడ్లు వేస్తున్నారని, పెన్షన్లు సమయానికి ఇస్తున్నారని, తల్లికి వందనం ఎంతమంది ఉంటే అంత మందికి ఇచ్చారని స్థానికులు ఎమ్మెల్యేలకు తెలిపారు.కొన్నిచోట్ల వీధి డ్రైనేజీలు, త్రాగునీటి ఇబ్బందులు ఎమ్మెల్యేల దృష్టికి స్థానికులు తీసుకురాగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ సమస్యను పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.కార్యక్రమంలో జగ్గంపేట మార్కెట్ యార్డ్ చైర్మన్ అడపా భరత్ కుమార్, టిడిపి రాష్ట్ర కార్యదర్శి ఎస్వీఎస్ అప్పలరాజు , గోకవరం సొసైటీ చైర్మన్ గాజింగం సత్తిబాబు, సర్పంచ్ అడపా వెంకట్రావు, మండల కన్వీనర్ మంగరౌతు రామకృష్ణ, జిల్లా ఆర్యవైశ్య అధ్యక్షులు బత్తుల సత్తిబాబు, కామరాజుపేటసొసైటీ చైర్మన్ పీర్ల వెంకటేశ్వరరావు, మాజీ సర్పంచ్ అడపా బాబులు, మరియు టిడిపి శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు