29 November 2025
Saturday, November 29, 2025

రాందేవ్‌బాబా భక్తులకు ఘన సత్కారం

Share
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి

రాజస్థానీ యాత్రికులకు వసతి భోజన వసతి కల్పించిన పాలచర్ల నాగేంద్ర చౌదరి

విశ్వం వాయిస్ న్యూస్, జగ్గంపేట

కాకినాడ జిల్లా జగ్గంపేటలో తెలుగుదేశం యువ నాయకులు, భారతీయ ధర్మ పరిషత్ రాష్ట్ర కార్యనిర్వహక అధ్యక్షులు, పాలచర్ల నాగేంద్ర చౌదరి వారి మోహన్ సాయి కృష్ణ రెసిడెన్సి నందు రాజమండ్రి నుండి కాలినడకన తీర్థయాత్ర చేసుకుంటూ తుని బాబా రాందేవ్ టెంపుల్ కి వెళ్తున్న రాజస్థాన్ మార్వాడి సోదరీ సోదరీమణులు అందరికీ జగ్గంపేటలో రాత్రి వారికి బస ఏర్పాటు చేసి ఉదయాన్నే పూజా కార్యక్రమం ముగించుకుని అల్పాహారం టి కాఫీ ఏర్పాటు చేసి, వారిని యాత్ర విజయవంతం కావాలని బాబా రాందేవ్ వారి ప్రతిమ మోస్తూ సామలమ్మ టెంపుల్ వరకు తీసుకువెళ్లి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేయించి అక్కడినుండి వారికి వీడ్కోలు పలికారు.ఈ సందర్భంగా నాగేంద్ర చౌదరి మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా ఆనవాయితీగా రాజమండ్రి నుండి తుని పాదయాత్ర చేస్తున్న రాజస్థానీ హిందూ బంధువులు అందరికీ ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా వారికి షెల్టర్ ఉండడానికి వసతి, భోజన వసతి కల్పిస్తానని ఈ సందర్భంగా వారికి తెలియజేశారు, మార్వాడి సోదరులు అందరూ నాగేంద్ర చౌదరి చేసే సేవా కార్యక్రమాలను అభినందించి వారితో బాబా రాందేవ్ వారికి ప్రత్యేక పూజలు చేయించారు, వారు ఆరాధ్య దైవమైన బాబా రాందేవ్ వారి ప్రసాదం అందజేశారు. రాజస్థానీ పద్ధతులు సన్మానించి వారికి చత్రపతి శివాజీ మహారాజ్ అడుగుజాడల్లో నడుస్తున్న నాగేంద్ర చౌదరికి శివాజీ మహారాజ్ యొక్క కత్తి బహు గురించి సన్మానించడం జరిగింది.

తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

రచయిత నుండి మరిన్ని

సంబంధిత వార్తలు

For Ads
ఆంధ్రప్రదేశ్
అంబేద్కర్ కోనసీమ
సాధారణ వార్తలు
కాకినాడ
రాజకీయాలు
క్రైమ్ వాయిస్
తూర్పు గోదావరి
విద్య వాయిస్
ఆధ్యాత్మికం
కిసాన్ వాయిస్
హెల్త్ వాయిస్
పండుగలు
సక్సెస్ వాయిస్
అలూరి సీతారామరాజు
తెలంగాణ
సినీ వాయిస్
క్రీడా వాయిస్
ఎడిటర్ వాయిస్
టెక్నాలజీ
తీర్పు వాయిస్
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo