హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తన వాహనంలో తరలించిన రూరల్ సీఐ దొరరాజు…
మండపేట మండలం ఇప్పనపాడు రోడ్ లో జరిగిన ప్రమాదం లో ఓ వృద్ధురాలు గాయపడగా ఆటోలు, అంబులెన్స్ రాకపోవడం తో అక్కడే వేచి ఉన్నారు. ఈ క్రమంలో ఇప్పనపాడు పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహించి మండపేట విచ్చేస్తున్న మండపేట రూరల్ సిఐ పి దొర రాజు అక్కడ జనాన్ని చూసి తన వాహనాన్ని అక్కడ నిలిపి వాకబు చేశారు. అక్కడ గాయపడి ఉన్న మహిళను హుటా హుటిన తన వాహనం లో ఎక్కించుకుని మండపేట ప్రభుత్వ ఆసుపత్రి లో చేర్చారు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు మండపేట రావులపేట కు చెందిన గరగ సత్యవతి(60) వైజాగ్ నుండి రైలు లో ద్వారపూడి వచ్చారు. ఆమె మనువడు తరుణ్ ఆమె ను మోటర్ సైకిల్ పై మండపేట తీసుకొని వస్తుండగా దారి మద్యలో ఇప్పనపాడు నవీన రైస్ మిల్లు ఎదురుగా వచ్చేసరికి మోటర్ సైకిల్ అదుపు తప్పి సత్యవతి రోడ్ పై పడింది. తలకు గాయం అయింది. స్థానికులు అక్కడికి చేరుకొని అంబులెన్స్ కు కాల్ చేశారు. ఇలోగా ఏదైనా ఆటో వస్తె అందులో తరలించేందుకు ఎదురు చూస్తున్నారు. ఎంత సేపటి వాహనాలు రాకపోవడం తో ఆందోళన చెందారు. అదే సమయంలో రూరల్ స్టేషన్ లో పని ముగించుకొని మండపేట తన కార్యాలయం కు వెళుతున్న రూరల్ సి ఐ దొర రాజు తన వాహనాన్ని నిలిపి ఆమె ను ఎక్కించుకొని మండపేట ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించారు. సకాలంలో చేరుకోవడం తో ప్రాణాపాయం తప్పిందని వైద్యులు చెప్పారు. ఆమె చికిత్స పొందుతూ కోలుకున్నారు. కాగా మానవతా దృక్పథం తో సి ఐ దొర రాజు స్వయం గా ఆమె ను తన జిప్ లో ఎక్కించుకొని తీసుకు వెళ్లడాన్ని ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.