రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వైసీపీ కార్యకర్త దార్ల అబ్రహంను మున్సిపల్ చైర్ పర్సన్ పతివాడ దుర్గారాణి పరామర్శించారు. గురువారం స్థానిక సాయి ఆర్థో హాస్పిటల్లో ఆయనను పరామర్శించి ప్రమాదానికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అబ్రహంకు మెరుగైన వైద్యం అందించాలని ఆసుపత్రి వైద్యుడిని కోరారు.ఈ పరామర్శలో కౌన్సిలర్ మందపల్లి రవికుమార్, వైస్సార్సీపీ నాయకులు ఎర్రగుంట అయ్యప్ప, దుగ్గిరాల చిన్న, పందిరి బాబి తదితరులు ఉన్నారు.