వక్ఫ్ సవరణ చట్టాన్ని రద్దు చేయాలి…
మండపేట ముస్లిం జె ఏ సి డిమాండ్…
కేంద్ర ప్రభుత్వం తీసుకొని వచ్చిన వక్ఫ్ సవరణ చట్టంలో అనేక లోపాలు ఉన్నాయని ముస్లిం జె ఏ సి కన్వీనర్ సయ్యద్ ఇబ్రహీం షరీఫ్ అన్నారు. వక్ఫ్ సవరణ చట్టాన్ని రద్దు చేయాలని ముస్లిం పర్సనల్ లా బోర్డు ఇచ్చిన పిలుపు మేరకు జిల్లా కలెక్టర్లకు వినతిపత్రం ఇస్తున్నారని తెలిపారు. దీంతో డాక్టర్ బి అర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ కార్యలయంలో డి అర్ ఓ కు మండపేట ముస్లిం జె ఏ సి సభ్యులు వినతిపత్రాన్ని అందజేశారనీ స్థానిక మీడియా కు తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వక్ఫ్ సవరణ చట్టంలో అనేక లోపాభూయిష్టమైన అంశాలున్నాయని ఆరోపించారు. వక్ఫ్ సవరణ చట్టాన్ని పరిశీలించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో జె ఏ సి కో-కన్వీనర్స్ షేక్ మౌలానా , ఎండీ అర్షి, సభ్యులు ఎండి అతవూర్ రెహమాన్ అల్తాఫ్, జిల్లా నూర్ భాషా సంఘం అధ్యక్షుడు షేక్ ఇబ్రాహీం, షేక్ మౌలాలి, అల్ అమీన్ మజీద్ ప్రెసిడెంట్ ఎండి రహీం తదితరులు పాల్గొన్నారు