ఈవ్ టీజింగ్‌కి చెక్ – డ్రోన్‌లతో నిఘా
కాకినాడ జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్(ఐపీఎస్ )వారు జిల్లా వ్యాప్తంగా ఉన్న విద్యాసంస్థల వద్ద విద్యార్థినీల భద్రత కోసం సమగ్ర చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో గురువారం జగ్గంపేటలోని శ్రీ ప్రజ్ఞ జూనియర్ కళాశాల కమ్ హైస్కూల్ వద్ద ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టారు.ఈవ్ టీజింగ్, ర్యాగింగ్ వంటి ఘటనలు జరగకుండా మానవ వనరులతో పాటు ఆధునిక సాంకేతికతను కూడా ఉపయోగిస్తున్నారు. కళాశాల పరిసరాల్లోకి అనధికారికంగా బయట వ్యక్తులు ప్రవేశించకుండా చర్యలు తీసుకోగా, డ్రోన్ కెమెరాల సహాయంతో పరిసర ప్రాంతాలపై నిఘా పెట్టారు.
ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించిన జగ్గంపేట సి ఐ వై.ఆర్.కే. శ్రీనివాస్ మాట్లాడుతూ, “విద్యార్థినీల భద్రతపై ఎటువంటి రాజీ లేదు. జగ్గంపేట సర్కిల్ పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. పరిసరాలలో గస్తీ తో పాటు డ్రోన్లతో 24×7 నిఘా కొనసాగుతుందని విద్యార్థినుల తల్లిదండ్రులు కూడా తమ పిల్లల భద్రతపై పూర్తి విశ్వాసంతో ఉండవచ్చని వారు తెలిపారు.