ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మణి దంపతులను ..మర్యాదపూర్వకంగా కలిసిన గాంధీ
జగ్గంపేట మండలం ఇర్రిపాక గ్రామంలోని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ స్వగృహంలో ఇటీవల వీరవరం ప్రాథమిక వ్యవసాయ సహకార సొసైటీ చైర్మన్‌గా నియమితులైన తోట సతీష్ కుమార్ (గాంధీ) మర్యాదపూర్వకంగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మరియు ఆయన భార్య మణి దంపతులను కలిసి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దంపతులను గౌరవపూర్వకంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో వీరవరం సొసైటీకి తాజాగా సభ్యులుగా నియమితులైన నమసాని త్రాసు, మణుగుల బాబ్జి కూడా ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ ‘‘చైర్మన్ పదవికి అవకాశం కల్పించిన జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. వారి మార్గనిర్దేశనతో సొసైటీ అభివృద్ధికి కృషిచేస్తాను. రైతులకు అందే రాయితీలను సమర్ధవంతంగా వినియోగపరిచి ఎల్లప్పుడు వారి సేవలో నిలబడతాను,’’ అని తెలిపారు.చైర్మన్‌గా నియమితులైన తోట గాంధీకి పలువురు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ తోట రవి, క్లస్టర్ ఇంచార్జి వీరారెడ్డి కాశిబాబు, పాఠం శెట్టి మురళీకృష్ణ, నీలం శ్రీను, జ్యోతుల రాంబాబు, గో డేబాల, కంట శ్రీను, కంచుమర్తి రాఘవ, సూరిశెట్టి వెంకట శివ, గోడే దొరబాబు, కరణం బురయ్య, కానూరి కాసులు,నారాయణరావు, బీసెట్టి సూరిబాబు తదితరులు పాల్గొన్నారు.