జగంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ స్వాగతం – పార్టీ బలోపేతానికి నూతన బలం
కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు ముస్లిం నాయకులు తెలుగుదేశం పార్టీలో చేరారు. స్థానిక రావులమ్మనగర్ లో గల ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో జరిగిన కార్యక్రమంలో గోకవరం సొసైటీ చైర్మన్ ఘాజింగం సత్తిబాబు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ సమక్షంలో వీరు టీడీపీలో చేరారు.ఈ సందర్భంగా షేక్ మదీనా సాహెబ్, ఎస్‌కే సంటీ సాహెబ్, ఎస్‌కే శ్రీ మదీనా శ్రీను, ఎస్‌కే ఫిరోజ్ ఆలీషా, ఎస్ ఎస్ ఎస్‌కే మహమ్మద్ అలీ, ఎస్‌కే పఖీర్ మహమ్మద్, ఎస్‌కే పాప సాహెబ్, ఎస్‌కే రజక్వల్లి, ఎస్‌కే మదీనా (చిన్న) తదితరులు తమ అనుచరులతో పాటు అధికార వైసీపీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలోకి అడుగుపెట్టారు. వీరితో పాటు వైసీపీ కాపు నేతలు వెలిశెట్టి శివ, పదిలం సూరిబాబులు కూడా పార్టీలో చేరారు.తెలుగుదేశం పార్టీలో చేరిన వారందరికీ పార్టీ కండువాలు వేసి స్వాగతం పలికిన ఎమ్మెల్యే నెహ్రూ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో రాష్ట్రం అత్యుత్తమ అభివృద్ధి దిశగా సాగిపోతుందని, అమరావతి నిర్మాణం, పోలవరం పనులు వేగంగా జరుగుతుండటమే కాకుండా, “సూపర్ సిక్స్” పథకాల అమలుతో రాష్ట్ర ప్రజలకు నూతన ఆశాజ్యోతి కనిపిస్తోందన్నారు. ఈ నేపథ్యంలో వైసీపీకి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు చంద్రబాబు పాలనపై నమ్మకంతో టీడీపీలో చేరుతున్నారని ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో గోకవరం టౌన్ ప్రెసిడెంట్ పైలా శ్రీనివాసరావు, మారిశెట్టి భద్రం, పిల్ల చంటిబాబు, ఎస్.బాబు, గుబ్బలమ్మ గుడి చైర్మన్ ఆచంట రాజు, పోసిన ప్రసాద్, రాష్ట్ర ఎస్సీ సెల్ కమిటీ అధ్యక్షులు గునిపే భరత్, మేడిశెట్టి వీరబాబు, జి.సన్యాసిరావు, వెన్ను వీరబాబు తదితరులు పాల్గొన్నారు.