కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం జె. కొత్తూరు గ్రామ శివారు వెలసినటువంటి శ్రీ కనక దుర్గమ్మ ఆలయం వద్ద శుక్రవారం సేవరత్నా అవార్డ్ గ్రహీత హిందూ ధర్మ పరిరక్షణ సేవ సమితి రాష్ట్ర బోర్డు నెంబర్, భారతీయ ధర్మ పరిషత్ రాష్ట్ర కార్యవర్గ అధ్యక్షులు, సామాజిక సేవకులు పాలచర్ల నాగేంద్ర చౌదరి ని ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా సత్కరించారు.అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి అమ్మవారి ఆశీసులు అందించడం జరిగింది.అలాగే పాలచర్ల నాగేంద్ర చౌదరి ఇచ్చిన సలహాలు సూచనలు తీసుకుని గుడిని అభివృద్ధిని చేయడం జరుగుతుంది అన్నారు. ఈ సందర్భంగా నాగేంద్ర చౌదరి మాట్లాడుతూ కొత్తూరు కనకదుర్గ అమ్మవారు మహిమ గల అమ్మవారిని కోరిన కోరికలు సిద్ధిస్తాయని ప్రతి శుక్రవారం ఈ ఆలయం వద్ద అన్నదానం నిర్వహించడం జరుగుతుందని ఈ ఆలయ కమిటీ వారు నాకు సన్మానం చేయటం చాలా ఆనందంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో కనకదుర్గ అమ్మవారి ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.