జగ్గంపేట ఎస్సై టి. రఘునందన్ రావు
కాకినాడ జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ (ఐపీఎస్ ) ఆదేశాల మేరకు, “సైబర్ నేరాలు – డ్రగ్స్ వద్దు బ్రో – మహిళలపై నేరాల నివారణ”పై ప్రజల్లో అవగాహన పెంచేందుకు విస్తృత కార్యక్రమాలు చేపట్టాలని సూచనలు జారీ చేయడం జరిగింది.
ఈ నేపథ్యంలో, శుక్రవారం జగ్గంపేట ఆర్టీసీ కాంప్లెక్స్ లో ఎస్సై రఘునందన్ రావు మరియు పోలీసు సిబ్బంది ఆధ్వర్యంలో విద్యార్థులు, ప్రయాణికులకు అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది. ఇందులో కాకినాడ జిల్లా ఎస్పీ అందించిన ప్రత్యేక వీడియోలు ప్రదర్శించబడ్డాయి. వీటిలో సైబర్ క్రైమ్ మోసాలు, రోడ్డు ప్రమాదాల నివారణ, హెల్మెట్ ధరించాల్సిన అవసరం, మహిళలపై నేరాలు వంటి అంశాలపై విస్తృతంగా వివరణ ఇవ్వబడింది.ఈ కార్యక్రమాన్ని విద్యార్థులు, ప్రయాణికులు ఆసక్తిగా తిలకించగా, వారు పోలీసు శాఖ చేపడుతున్న ఈ మార్గదర్శక కార్యక్రమాన్ని ప్రశంసించారు.
జగ్గంపేట సర్కిల్ పోలీస్ విభాగం ప్రజల మధ్య సున్నితమైన అంశాలపై అవగాహన పెంపొందించేందుకు నిరంతరం కృషి చేస్తూ ప్రజల మద్దతుతో ముందుకు సాగుతుందని జగ్గంపేట సి ఐ వై ఆర్ కె శ్రీనివాస్ తెలిపారు .